జాతీయ వార్తలు

మళ్లీ ఢిల్లీలో బేసి-సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: వాయు కాలుష్యం ఢిల్లీ ప్రజలను తీవ్రంగా కలవరపరుస్తున్నది. కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడి బేంబేలెతుత్తుతున్నారు. అయితే కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నడుం బిగించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో తర్జన-్భర్జన చేసి చివరకు గతంలో అమలు చేసిన విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. బేసి-సరి వాహనాలను రోడ్లపైకి వేర్వేరు రోజుల్లో అనుమతిస్తారు. అంటే రిజిస్ట్రేషన్ ప్రకారం బేసి-సరి సంఖ్య వాహనాలను రోజు విడిచి రోజు అనుమతిస్తారు. నవంబర్ 4 నుంచి 15 మధ్య కాలంలో దీనిని అమలు చేయనున్నారు.
దీంతో పాటు ఏడు సూత్రాల కార్యాచరణ పథకాన్ని ప్రవేశ పెట్టాలని అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. కాలుష్యాన్ని నియంత్రించే మాస్క్‌లు పెద్ద ఎత్తున పంపిణీ చేయాలని, రోడ్లపై నీటిని చిలుకరించడం (స్ప్రిక్లింగ్), మొక్కలు నాటడం, 12 చోట్ల ప్రత్యేకమైన పొల్యూషన్ హాట్ స్పాట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ఢిల్లీ ప్రభుత్వం రెండు పర్యాయాలు ప్రయోగాలు చేసింది. 2016 సంవత్సరం జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో దీనిని ఉల్లంఘించిన వారికి రూ.2 వేలు జరిమానా విధించింది. ఈ పథకాన్ని అమలు చేసే విధానం గురించి ప్రజలకు త్వరలో స్పష్టంగా తెలియజేస్తామన్నారు. అయితే ద్విచక్ర వాహనాలకు, మహిళలు స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్ళే వాహనాలకు ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జిఆర్‌ఎపీ) నిబంధనల్లో మినహాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. బేసి, సరి సంఖ్య వాహనాల విషయంలో ప్రైవేటు వాహనాలకే వర్తింపజేయనున్నట్లు చెప్పారు. 11 నెలలుగా వాయు కాలుష్యం తగ్గిందన్నారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో పంటలు దగ్దం చేయడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిలువరించగలిగాయని తెలిపారు. వారికి తమ ప్రభుత్వం కూడా చేయూతనిస్తుందన్నారు. వాయు కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం చేపట్టిన దీర్ఘకాలిక ప్రణాళికలు మంచి ఫలితాలు ఇచ్చాయని ఆయన చెప్పారు. త్వరలో ఈ-వెహికల్ విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తమకు 1,200 సలహాలు, సూచనలు వచ్చాయని ఆయన చెప్పారు. నిపుణులైన పర్యావరణ వేత్తల సలహాలు కూడా తీసుకుని కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.