జాతీయ వార్తలు

భారతీయతకు ప్రతిరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత దేశ సంస్కృతి, సంప్రయాలకు అద్దం పట్టే విధంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. రాష్టప్రతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు రెండున్నర కిలోమీటర్లున్న రాజ్‌పథ్ ఇరువైపు ఉన్న పాత భవనాల స్థానంలో కొత్త దాన్ని నిర్మించాలని తలపెట్టారు. భారతీయతకు అద్దం పట్టేలా మోదీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశ ప్రజలకు కొత్త పార్లమెంట్ భవనాన్ని బహూకరిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్‌సింగ్ పురి ప్రకటించారు. రాష్టప్రతి భవన్ నుంచి ఇండియాగేట్ వరకూ రెండు కిలోమీటర్ల దూరంలో రాజ్‌పథ్ రెండు వైపుల ఉన్న పాత భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో ఆధునిక భవనాలను నిర్మిస్తారు. భారతీయత ఉట్టిపడేలా సెంట్రల్ ఢిల్లీని రూపొందించేందుకు మోదీ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. సెంట్రల్ ఢిల్లీలోని నాలుగు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఢిల్లీ రూపురేఖలు మార్చివేసే ప్రణాళికల రూపకల్పన జరుగుతోంది. లాండ్ పూలింగ్ ద్వారా కొత్త నిర్మాణాలతో 2024 నాటి ఢిల్లీని ప్రపంచంలోని అతి పెద్ద ‘మెగాపొలిస్’గా మార్చివేస్తామని హర్దీప్‌సింగ్ పురి తెలిపారు. హర్దీప్‌సింగ్ పురి శుక్రవారం ఫిక్కీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. 1911 నుంచి 1927 మధ్య కాలంలో నిర్మితమైన రాష్టప్రతి భవన్, పార్లమెంటు భవనం, సౌత్ బ్లాక్, నార్త్‌బ్లాక్ తదితర భవనాలను పునర్మించాలన్నది నరేంద్ర మోదీ కల. ఆ కల 2024 నాటికి నెరవేరుతుందని మంత్రి ప్రకటించారు. 2024 ఎన్నికల అనంతరం కొత్త పార్లమెంటులో కొత్త ప్రభుత్వం సమావేశం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. రాజ్‌పథ్‌తోపాటు దాని చుట్టుపక్కల ఉన్న పాత భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో అన్ని హంగులతో కూడిన ఆధునిక భవనాల నిర్మిస్తామన్నారు. దేశ రాజధాని ఢిల్లీని మెగాపొలిస్‌గా మార్చే ప్రక్రియలో కొత్తగా 17 లక్షల గృహాలను అదనంగా నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. 17 లక్షల్లో ఐదు లక్షల గృహాలు పేద, బలహీన వర్గాల వారికి కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్టప్రతి భవన్, పార్లమెంటుతోపాటు కేంద్ర ప్రభుత్వం అధికార పీఠమైన సౌత్ బ్లాక్, నార్త్‌బ్లాక్ రూపులేఖలు మారిపోనున్నాయి. ప్రధాన మంత్రి కార్యాలయం, రక్షణ మంత్రి కార్యాలయం ఉన్న సౌత్ బ్లాక్, హోం శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలున్న నార్త్‌బ్లాక్ భవనాలను కూడా మ్యూజియంగా మార్చివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే రాష్టప్రతి భవన్‌లో పలు మార్పులు, చేర్పులు చేయనున్నారు. ఇప్పుడున్న పార్లమెంటు భవనాన్ని పటిష్టం చేసి మ్యూజియం లేదా సమావేశమందిరంగా మారుస్తారు. రాష్టప్రతి భవనానికి కుడివైపున ఉన్న కుశక్ రోడ్డులో నాలుగైదు పాత భవనాలను కూల్చివేసి విశాలమైన భూమిలో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నారు. కుశక్ రోడ్డులోని డీఆర్‌డీఓ సేనా భవన్‌తోపాటు మరో నాలుగు పాత భవనాలను కూల్చివేసి భారత సంస్కృతికి అద్దం పట్టే కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని ఒకచోటికి తెచ్చేందుకు వీలుగా ఆధునిక భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. సెంట్రల్ ఢిల్లీని ఆధునీకీకరించేందుకు శాస్ర్తీ భవన్, ఉద్యోగ్ భవన్, కృషి భవన్, రైల్ భవన్, శ్రమశక్తి భవన్, సంచార్ భవన్, రవాణా భవన్, డీఆర్‌డీఓ భవనం, సేనా భవన్, వాయు భవన్, నీతి భవన్, జాతీయ మ్యూజియం భవనాలను కూల్చివేసే అవకాశాలున్నాయి.