జాతీయ వార్తలు

ఐరాస ఒడంబడికలను అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా, సెప్టెంబర్ 13: జీవ వైవిద్యం, వాతావరణ మార్పు, భూములు ఏడారులుగా మారడంపై ఐక్యరాజ్య సమితి ఒడంబడికలను మిళితం చేసి తమ దేశం ముందుకెళుతుందన్న విశ్వాసాన్ని భారత పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవడేకర్ వ్యక్తం చేశారు. రెండు వారాలుగా జరుగుతున్న యుఎన్‌సీసీడి పార్టీల 14వ సదస్సు శుక్రవారం ముగింపు సందర్భంగా మంత్రి జవడేకర్ మాట్లాడుతూ న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను త్వరలో స్వీకరించి అమలు చేస్తామన్నారు. భూమి క్షీణించడంపై ప్రపంచంలోని ప్రతి దేశం కూడా దీనిని ఏ విధంగా అధిగమించాలన్న అంశంపై దృష్టి సారించాలన్నారు. వాతావరణ మార్పు, భూమి ఏడారులుగా మారడం, జీవ వైవిధ్యం అంశాలపై సదస్సు ద్వారా పరస్పరం సహకరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. పెరుగుతున్న జనాభాకు భూమి అత్యంత అవసరం అని ఆయన తెలిపారు. న్యూఢిల్లీ డిక్లరేషన్ ప్రతిష్టాత్మక ప్రకటన అని, ప్రతి దేశం కూడా వీటిని అధిగమించాలన్నారు. భూమి ఏడారిగా మారడం, పర్యావరణ మార్పు వంటివి మానవాళి మనుగడకు ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూమిలో మార్పు లేదా ఏదైనా భంగం వాటిల్లినట్లయితే అది హానికరమైన లేదా అవాంఛనీయంగా మారుతుందని మంత్రి జవడేకర్ అన్నారు. గ్రేటర్ నోయిడాలో యుఎన్‌సిసిడి సదస్సు ముగిసిన అనంతరం ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి ఇబ్రహీం థైవ్ మీడియాతో మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ దేశాల్లో తరచూ కరవు నెలకొంటున్నదన్నారు. భూమి క్షీణత జరగకుండా ప్రపంచ దేశాలు నడుం బిగించాలని ఆయన కోరారు.