జాతీయ వార్తలు

ఉగ్రవాదం పని పడదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్మ్ (స్విట్జర్లాండ్), సెప్టెంబర్ 13: ఉగ్రవాదానికి ఊతాన్నిచ్చేది పన్నుల ఎగవేత, మనీ ల్యాండరింగ్ వ్యవహారాలేనని భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని భారత్, స్విట్జర్లాండ్ పరస్పరం పంచుకుంటే వీటిని అరికట్టడం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. స్విట్జర్లాండ్ ఫెడరల్ కౌన్సిల్‌ను ఉద్దేశించిన మాట్లాడిన కోవింద్ ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా అంతం చేసేందుకు సహకరించాలని కోరారు. రానున్న కొన్ని రోజుల్లోనే ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్‌గా పన్నులకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి వస్తుందన్న విషయం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇదెంతో సానుకూల పరిణామం అని పేర్కొన్న ఆయన పన్నుల ఎగవేత, నిధుల అక్రమ మళ్లింపులకు ఉగ్రవాదంతో బలమైన సంబంధం ఉంటుందని, ఈ రెండింటినీ అదుపు చేయగలిగితే ఈ మహమ్మారిని అంతం చేయవచ్చునని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటని, దశాబ్దాలుగా తీవ్రవాదం వల్ల భారత్ ఎంతగానో నష్టపోయిందని కోవింద్ తెలిపారు.
ఈ జాఢ్యాన్ని అంతం చేసే విషయంలో స్విట్జర్లాండ్ తమకు అన్నివిధాలుగా సహకరించాలని కోరుతున్నామని ఆయన అన్నారు. భారత్, స్విట్జరాండ్ మధ్య పరస్పర సమాచార మార్పిడి జరగడం వల్ల నల్లధనాన్ని అరికట్టాలన్న మోదీ సర్కారు ఆశయ సాధనకు ఎంతో వీలు కలుగుతుంది. తాజాగా కుదిరిన ఒప్పందంలో భాగంగా ఆయా వ్యక్తుల అకౌంట్ నెంబర్లు, బ్యాంకు నిల్వలు, ఇతర సమాచారాన్ని స్విస్ ఆర్థిక సంస్థలు అందిస్తాయి. ఈనెలలోనే తొలివిడత సమాచారాన్ని భారత్ అందుకోబోతోంది. అనంతరం ఏటేటా ఈ వివరాలను స్విట్జర్లాండ్ అందుబాటులోకి తెస్తుంది. అయితే, స్విస్ నుంచి తమకు అందిన వివరాలను భారత్ అత్యంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. నెలల తరబడి సాగిన చర్చోపచర్చల అనంతరమే ఈ సమాచారాన్ని అందించేందుకు స్విట్జర్లాండ్ అంగీకరించింది.