జాతీయ వార్తలు

ప్రజలతో మమేకం కావాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పార్టీ, ప్రభుత్వాలు, విభాగాలు సమన్వయంతో పని చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. శుక్రవారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులతో ఆమె చర్చలు జరిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, పుదుచ్చేరిల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎప్పటికప్పుడు ప్రజలు సమస్యలు తెలుసుకుని వాటి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా పార్టీ ప్రభుత్వాలను కోరిందని, ముఖ్యంగా మంత్రులే ప్రజల వద్దకు వెళ్ళి వారితో పార్టీని మరింత చేరువ చేసేందుకు ప్రయత్నించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోనూ పలు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాల కారణంగా ప్రతికూల సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, వీటి మధ్య కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పాలన సాగుతున్నదని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాలకు మంత్రులను పంపి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే చర్యలు చేపట్టాలని తమ పార్టీ ముఖ్యమంత్రులను సోనియా గాంధీ ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కూడా ఇదే పద్ధతిని అవలంభించినట్లుగా చెబుతున్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే తమ పార్టీ ప్రభుత్వాలు మరింత బలంగా ప్రజాస్వామ్యయుతంగా పని చేయాలని సోనియా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వాల పని తీరును కూడా సమీక్షించిన ఆమె మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పటిష్టమైన పర్యవేక్షిక, అమలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో తమ పార్టీ ప్రభుత్వాలు సాధించిన విజయాలను కూడా సమీక్షించారని కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే పార్టీకి ప్రభుత్వాలకు మధ్య సమన్వయాన్ని సాధించేందుకు జరిగిన ప్రయత్నాలను కూడా ఈ సందర్భంగా విశే్లషించారు. ప్రస్తుత ఆర్థిక మాంద్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను కూడా ఈ సమావేశంలో చర్చించారని ఆ ప్రకటనలో తెలిపారు. గతంలో కూడా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియా గాంధీ సమావేశమయ్యారని, ఈ రకమైన సమావేశాలను, సమీక్షా భేటీలను నిర్ణీత కాలక్రమంలో నిర్వహించాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డట్లు చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్, ఎకే ఆంటోని, కేసీ వేణుగోపాల్, అహ్మద్ పటేల్‌తో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అమరేందర్ సింగ్, అశోక్ గెహ్లాట్, కమల్‌నాథ్, భూపేష్ బాగెల్, జి. నారాయణ స్వామిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.