జాతీయ వార్తలు

అంతా సానుకూలమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 14: భారతీయుల్లో ఎక్కువ మందికి సానుకూల దృక్పధం ఉంటుందని, అనేక అంశాలపై పాజటీవ్‌గా స్పందిస్తారని ఓ సర్వే వెల్లడించింది. మద్రాస్ ఐఐటీ పూర్య విద్యార్థులు ‘మూడ్ ఆఫ్ నేషన్’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఇప్పటి నుంచి ఓ దశాబ్దం ముందుకు చూస్తే మరింత సానుకూల(కచ్చితమైన) దృక్పధంతో ఉంటారని అధ్యనంలో తేలింది. సంగం 2019 కాన్‌క్లేవ్ సందర్భంగా మూడ్ ఆఫ్ నేషన్ సర్వే వివరాలను వెల్లడించారు. 2030 నాటికి భారతీయుల్లో పాజిటీవ్‌నెస్ పెరుగుతుందని వెల్లడించారు. దేశం పట్ల వారెంతో అనుకూలత ప్రకటించారని నిర్వాహకులు తెలిపారు. ‘్భరత్ ఆర్థిక వ్యవస్థ అలాగే ద్రవ్య పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుందని 74 శాతం మంది అభిప్రాయపడ్డారు’అని నివేదికలో పేర్కొన్నారు. సర్వేలో మొత్తం 2,295 మంది పాల్గొన్నారు. మహిళలు, విద్యార్థుల అభిప్రాయ లు తెలుసుకున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు శాస్తవ్రేత్తలను రోల్‌మోడల్ (ఆదర్శం)గా స్వీకరించడం గమనార్హం. ఈ విషయంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు వెనకబడి ఉన్నారు. ఆర్థికాభివృద్ధి, వృద్ధిపైనే ప్రాధాన్యత ఇచ్చారు. టాప్ టెన్ ప్రాధాన్యత అంశాల్లో జనాభా నిర్మూలన, పెదరిక నిర్మూలన, సాంకేతిక సామర్థ్యం, వ్యవసాయం, అవినీతి నిర్మూలన, పర్యావరణకు చోటు దక్కింది. ప్రపంచంలో భారత్ తిరుగులేని శక్తిగా రూపొందాలంటే పారిశ్రామికీకరణ అవసరమని సర్వేలో పాల్గొన్న అన్ని తరగతుల వారూ అభిప్రాయపడ్డారు. వచ్చే దశాబ్దం నాటికి ఐటీ పరిశ్రమ మరిం త రాణిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్పత్తిరంగం, ఆటోమొబైల్, వ్యవసాయం, ఆహార, అంతరిక్ష రంగంలో 2030 నాటికి భారత్ దూసుకుపోతుందన్న ధీమా వ్యక్తమైంది.
మద్రాస్ ఐఐటీలో సంగం 2019 వార్షిక సమావేశం ఏర్పాటైంది. తమిళనాడు అధికార భాషా శాఖ మంత్రి కే పండియరాజన్, ఇన్ఫోసిస్ కో-్ఫండర్, యాక్సిలర్ వెంచర్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర్ రామమూర్తి హాజరయ్యారు.