జాతీయ వార్తలు

దేశాన్ని ఏకం చేసే శక్తి హిందీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: దాదాపుగా దేశ జనాభా అంతా మాట్లాడే హిందీ భాష ఓ సమైక్య శక్తి అని, ప్రజల మధ్య వారధి అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారంనాడు ఇక్కడ స్పష్టం చేశారు. దీని దృష్ట్యా మొత్తం దేశానికే హిందీని ఉమ్మడి భాషగా మార్చాలన్న అభిప్రాయాన్ని ఆయన హిందీ దివస్ సందర్భంగా వ్యక్తం చేశారు. అయితే, ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు తమ మాతృభాషలోనే సంభాషించాలని పేర్కొన్న ఆయన హిందీ భాషను దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. ‘్భరతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ప్రతి భాష ఎంతో ముఖ్యమైనది. అయినా మొత్తం దేశ జనాభాను ఏకం చేసే ఉమ్మడి భాష ఉండడం అన్నది ఎంతైనా అవసరం. దీనివల్ల అంతర్జాతీయంగా భారత్‌కు ఓ బలమైన గుర్తింపు వస్తుంది’ అని అన్నారు. దేశంలోని మిగతా భాషల కంటే కూడా మెజారిటీ ప్రజలు మాట్లాడేది ఓ సమైక్యతా భావాన్ని వ్యక్తీకరించేది హిందీ భాషేనని ఆయన తెలిపారు. ప్రజలు తమ తమ భాషల్లో సంభాషించినప్పటికి కూడా మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ ఆశయాలను దృష్టిలో పెట్టుకుని హిందీ భాషను కూడా వినియోగించాలని అమిత్ షా అన్నారు. 1963నాటి అధికార భాషా చట్టం ప్రకారం హిందీ, ఆంగ్లం కేంద్ర ప్రభుత్వ, అలాగే పార్లమెంట్‌లలో అధికార భాషగా కొనసాగుతున్నాయి. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో మొత్తం 22 భారతీయ భాషలను గుర్తించారని ఆయన అన్నారు. సమైక్య భారతావని కోసం పాటుపడ్డ మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కూడా హిందీని అధికార భాషగా అంగీకరించాలని ప్రజలను అభ్యర్థించాలని అన్నారు. భిన్న భాషలన్నవి భారతదేశ శక్తికి నిదర్శనమని పేర్కొన్న ఆయన విదేశీ భాషలు, సంస్కృతుల ప్రభావం మనల్ని ఆవహించకుండా ఉండాలంటే ఓ జాతీయ భాష అన్నది ఎంతైనా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య వినోభాభావే హిందీ భాషపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను, అలాగే ఓ జాతీయ భాష లేకపోతే ఏ దేశమైనా మూగదే అవుతుందన్న మహాత్ముడి అభిప్రాయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. జాతీయ భాష లేకపోతే మన సంస్కృతిని వ్యక్తీకరించే శక్తి తగ్గిపోతుందని పేర్కొన్న ఆయన ఇతర ప్రాంతీయ భాషల ప్రాధాన్యతను ఫణంగా పెట్టి హిందీ భాషను అభివృద్ధి చేసే ప్రసక్తే లేదని అన్నారు. హిందీ భాష సహజీవనానికి ప్రతీక అని పేర్కొన్న ఆయన రాజ్యాంగ పరిషత్‌లోనే హిందీని అధికార భాషగా చేసే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని ఆయన గుర్తు చేశారు. భిన్న సంస్కృతులు మేళవించిన అద్భుత భాషా సౌరభానికి భారతదేశం ప్రతీక అని పేర్కొన్న ఆయన దేశంలో 120 భాషలు, 19,500కు పైగా మాండలికాలు ఉన్నాయని గుర్తు చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారదేశ అంతర్గత శక్తికి ప్రధాన లక్షణమే అయినప్పటికీ సాంస్కృతికంగా ప్రజలను ఏకం చేసేందుకు ఓ ఉమ్మడి భాష అన్నది ఎంతైనా అవసరమని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో వినియోగించే హిందీని తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. దేశంలోని ప్రతి వ్యక్తికీ ప్రతి ఇంటికీ హిందీని దరిచేర్చాలని, వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా అనేకచోట్ల హిందీ భాషా దినోత్సవాలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో తమ మాతృభాషలోనే మాట్లాడాలని, సహచరులతో కూడా అదే భాషలో సంభాషించాలని ఆయన అన్నారు. 2024లో జరిగే తదుపరి ఎన్నికల నాటికి హిందీ భాష నిరుపమాన స్థాయిని సంతరించుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
చిత్రం... హిందీ దివస్ సందర్భంగా శనివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా