జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో షాపులు మూయిస్తున్న ఉగ్రవాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 15: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసినప్పటి నుంచి అక్కడ ప్రశాంత వాతావరణం కొనసాగుతోందనీ.. వ్యాపార, వాణిజ్య సముదాయాలు సక్రమంగా పనిచేస్తున్నాయనీ.. స్కూళ్లు, కళాశాలలు తెరుస్తున్నారనీ.. కార్యాలయాలకు సైతం ఉద్యోగులు బాగానే హాజరౌతున్నారని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ అక్కడ విభిన్న వాతావరణం కొనసాగుతున్నట్లు సమాచారం. కేవలం శ్రీనగర్‌లోనే దాదాపు రెండు డజన్ల మంది ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను చాపకింద నీరులా సాగిస్తున్నారనీ.. దుకాణాలు మూసివేయాలని బహిరంగంగానే బెదిరిస్తున్నారని కొంతమంది అధికారులు చెబుతున్నారు. ఇది భద్రతా దళాలకు ఓ సవాలుగా మారిందనే చెప్పాలి. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. 370 అధికరణ రద్దు తరువాత కేవలం రెండు ఘటనలు మాత్రమే చోటు చేసుకొన్నట్లు భద్రతాధికారుల సమాచారం.
ఆగస్టు ఐదో తేదీన 370 అధికరణ రద్దు అనంతరం టీవీ చానళ్ల ప్రసారాలపై నిషేధం నేపథ్యంలో పలుచోట్ల స్థానికులు రాళ్లు రువ్వడం వంటి ఘటనలతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. శ్రీనగర్‌తో పాటు పలు గ్రామాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయనీ.. దాదాపు రెండు డజన్ల మంది ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకోవడానికి షాపులను బలవంతంగా మూయించడం.. వ్యాపారులను బెదిరించడం వంటి ఘటనలకు తెగబడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కాగా, ఉగ్రవాద కార్యకలాపాలపై జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్‌బగ్ సింగ్ మాట్లాడుతూ వారి ఉనికిపై ఎలాంటి ప్రస్తావన తీసుకురాకుండా.. ఆ వదంతులను ‘అతిశయోక్తి’గా అభివర్ణించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు మాత్రం దాదాపు రెండు డజన్ల మంది ఉగ్రవాదులు తమ కార్యకలాపాలకు పాల్పడుతూ జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నారని చెబుతున్నారు. ఆగస్టు ఐదో తేదీన ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్నారనీ.. దీంతో వారు మరింత రెచ్చిపోయి ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి స్పష్టం చేశారు. కాగా, 370 అధికరణ రద్దు అనంతరం ఆగస్టు 20వ తేదీన బారాముల్లాలో, ఈనెల తొమ్మిదో తేదీన సోపోర్‌లోను ఎన్‌కౌంటర్లు జరిగినట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి.
కాగా, అధికరణ రద్దు అనంతరం ఎక్కడా స్థానికులు మృతి చెందడం కానీ.. కిడ్నాప్ సంఘటనలు కానీ జరగలేదని అధికారులు పేర్కొన్నారు.