జాతీయ వార్తలు

స్థూల ఆర్థిక నైపుణ్యమే గట్టెక్కిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: స్థూలార్థిక శాస్త్రంలో గట్టి పట్టున్న వారు మాత్రమే ప్రస్తుత సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించగలుగుతారని భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలను తరచుగా విమర్శిస్తూ వచ్చిన సుబ్రమణియన్ స్వామి తాజాగా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి ఈ రోజు అనుభవజ్ఞులయిన రాజకీయవేత్తలు, నిపుణులతో కూడిన బృందం అవసరం ఉంది. నిపుణులంటే భారతీయ ఆచారవిచారాల మూలాలు తెలిసిన రాజకీయ సామర్థ్యం కలిగిన ఆర్థికవేత్తలు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలకు విధేయులయిన వారు కాదు’ అని స్వామి అభిప్రాయపడ్డారు. స్వామి భారత ఆర్థిక వ్యవస్థ గతాన్ని, ప్రస్తుతాన్ని వివిధ కోణాల నుంచి నిశితంగా పరిశీలించి ఒక పుస్తకాన్ని వెలువరించారు. ‘ఈ రోజు ఎలాంటి మర్మం తెలియని ఆర్థిక ఉగ్రాణాధిపత్యం, మీడియా నిర్వహణ నుంచి ఆర్థిక వ్యవస్థ సతమతం అవుతోంది. తీవ్రమయిన బహుళ వ్యవస్థీకృత తప్పిదాల వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. దాని ఫలితంగానే మిగతా దేశాలకు భిన్నంగా మనం ప్రస్తుత ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాం. భారత్‌లో 1947 నుంచి ఈ అనుభవం ఉన్నది’ అని సుబ్రమణియన్ స్వామి తన తాజా పుస్తకం ‘రిసెట్: రిగెయినింగ్ ఇండియాస్ ఎకనమిక్ లెగాసి’ అనే తన పుస్తకంలో రాశారు. ప్రభుత్వ సబ్ కమిటీలలో ఉన్న అనేక మంది సభ్యులు స్థూలార్థిక ఫ్రేమ్‌వర్క్‌లో అనువర్తింప చేయడానికి అవసరమయిన క్వాంటిటేటివ్ ఎకనమిక్ లాజిక్‌లో నియత శిక్షణ పొందలేదని సుబ్రమణ్య స్వామి అభిప్రాయపడ్డారు.

*చిత్రం... తన 80వ జన్మదినం సందర్భంగా ఆదివారం అయోధ్యలోని కంచి శంకరాచార్య మఠంలో ప్రార్థనలు చేస్తున్న బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి