జాతీయ వార్తలు

హిందీపై కేంద్రానిది ఏకపక్ష ధోరణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 15: దేశవ్యాప్తంగా హిందీ భాషను అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ విమర్శించారు. ఇలాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైల్వేలు, పోస్టల్ విభాగాలు నిర్వహించే పోటీ పరీక్షల్లో తమిళనాడును పక్కన పెట్టారని ఆదివారం ఇక్కడ జరిగిన ఎండీఎంకే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అన్నారు. హిందీ భాషను ఉమ్మడి భాషగా అమలు చేయాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన జాతీయ సమగ్రతకే ముప్పులాంటిదని, దీనిని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ హక్కులను సాధించుకోవడానికోసం రోజువారీగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని డీఎంకే మొదటినుంచీ వ్యతిరేకిస్తూ వస్తోందని, 1949, 1953 నుంచి ఇప్పటివరకు ఇలాంటి ఉద్యమాలెన్నో జరిగాయని ఆయన గుర్తు చేశారు. 1965లో అత్యంత తీవ్ర స్థాయిలో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగిందని గుర్తు చేసిన ఆయన ‘ఇప్పుడు కూడా అలాంటి ఉద్యమానికి దారితీసే పరిస్థితులు దాపురిస్తున్నాయా?’ అని ఆయన అన్నారు. కేంద్రం మొదటినుంచీ హిందీని తమపై రుద్దుతూనే ఉందని, తాము వ్యతిరేకిస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. ఒక్క హిందీ విషయంలోనే కాకుండా నీట్, కావేరీ సహా అనేక అంశాలపై తమిళనాడుకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆయన అన్నారు.

*చిత్రం...డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్