జాతీయ వార్తలు

ఒకే భాష..ఒకే జాతి అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 15: ఒకే భాష.. ఒకే దేశం అన్న ఆలోచన ఎప్పటికీ వాస్తవం కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాం రమేష్ అన్నారు. హిందీని ఉమ్మడి భాషగా అమలు చేయాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకే జాతి ఒకే పన్ను ఆలోచన అమలు కావొచ్చునేమో కానీ, ఒకే దేశం..ఒకే భాష అన్నది ఎన్నటికీ వాస్తవం కాదన్నారు. భారతదేశం ఒకటే అయినా, భిన్న సంస్కృతులు భాషలతో విలసిల్లుతోందని జై రాం రమేష్ తెలిపారు.
ఆదివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో సభికులను ఉద్దేశించి హిందీ, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఆయన మాట్లాడారు. ‘ఒక్క నిమిషంలో నేను మూడు భాషల్లో మాట్లాడడానికి కారణం భారతదేశ వైవిధ్యాన్ని చాటిచెప్పడానికే’ అని జై రాం రమేష్ అన్నారు. ఒకే పన్ను ఒకే ఎన్నిక ఉండవచ్చునేమోకానీ, ఒకే సంస్కృతి ఒకే భాష.. ఒకే దేశం అన్నది మనజాలవన్నారు. బెంగళూరులో మోక్షగుండం విశే్వశ్వరయ్య సంస్మరోపన్యాసం చేసిన జై రాం రమేష్ ‘జవహర్ లాల్ నెహ్రూ విశే్వశ్వరయ్యకు సంబంధించి ఎంతో సారూప్యత ఉంది. మేథోపరమైన నిజాయితీ ఆయన సొంతం ఇప్పడు అవన్నీ ప్రమాదంలో పడ్డాయి’ అని అన్నారు. నవభారత నిర్మాత అయిన జవహర్ లాల్ నెహ్రూ ఆచరించిన విలువలను తుంగలో తొక్కే ప్రమాదం జరుగుతుందని జై రాం రమేష్ అన్నారు. నెహ్రూ ఆలోచనలను విస్మరిస్తే భారతీయత అన్న భావనే ప్రమాదంలో పడుతుందన్నారు.
విశే్వశ్వరయ్య సిద్ధాంతాలు, ఆదర్శాలకు కట్టుబడి ఉండడమే ఆయన ఘన నివాళి అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నాటక గవర్నర్ వాజూభాయ్ వాలా, ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కూడా పాల్గొన్నారు.
హిందీని రుద్దడమే ఆర్‌ఎస్‌ఎస్ అజెండా: ఏచూరి
న్యూఢిల్లీ: హిందీని జాతీయ భాషగా రుద్దాలన్నదే ఆర్‌ఎస్‌ఎస్ ఏకైక అజెండా అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆదివారం నాడు ఇక్కడ ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమే ఒకే జాతి.. ఒకే భాష.. ఒకే సంస్కతి అని పేర్కొన్న ఆయన ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అన్నారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలన్నీ జాతీయ భాషలేనని, అయితే హిందీ వ్యవహార భాషగా కొనసాగవచ్చునేమోగానీ, దీన్ని జాతీయ భాషగా రుద్దడం ప్రతికూల పర్యవసానాలకు దారితీస్తుందని ఏచూరి అన్నారు. గతంలో కూడా ఇలాంటి పరిణామాలెన్నో దేశంలో జరిగాయని తెలిపారు. అన్ని భాషలను సమాన ప్రాతిపదికన చూడాలని స్పష్టం చేశారు.

*చిత్రం... కాంగ్రెస్ నేత జైరాం రమేష్