జాతీయ వార్తలు

హర్యానాలోనూ అమలు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 15: అస్సాంలో జాతీయ పౌర రిజిస్ట్రీ అమలు వ్యవహారం రాజకీయ రాద్ధాంతాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో దీనిని తాము కూడా అమలు చేస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదివారంనాడు ప్రకటించారు. మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్ హెచ్‌ఎస్ భళ్లాను కలుసుకున్న ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్‌ఆర్‌సీలో భళ్లా పనిచేస్తున్నారని, హర్యానాలో దీని అమలుకు సంబంధించిన సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడామని ఖట్టర్ తెలిపారు. దీనిని అమలు చేసే విషయంలో సహకరించాల్సిందిగా ఆయన అభ్యర్థించారని ఆయన అన్నారు.