జాతీయ వార్తలు

మళ్లీ మాకే అపూర్వ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే : మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అపూర్వమయిన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం నిర్వహిస్తున్న ‘మహాజనదేశ్ యాత్ర’ ఇప్పటి వరకు మూడు వేలకు పైగా కిలో మీటర్ల దూరం సాగిందని, రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వందకు పైగా నియోజకవర్గాల మీదుగా సాగిందని ఆయన తెలిపారు. ‘మేము ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. యాత్రకు భారీ స్పందన లభిస్తోంది. ప్రజల మద్దతు చూసిన తరువాత, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మేము అపూర్వ విజయాన్ని అందుకోవడం ఖాయమని భావిస్తున్నాం’ అని ఫడ్నవీస్ ఆదివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఫడ్నవీస్ తన మహాజనదేశ్ యాత్ర మూడో దశలో భాగంగా శనివారం పుణేలోని కొన్ని తాలుకాలను సందర్శించారు. బారామతి పట్టణంలో తన యాత్రకు వ్యతిరేకంగా ఎన్‌సీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడాన్ని ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. శరద్ పవార్ కోటలో ఇతర ఏ పార్టీని ర్యాలీ నిర్వహించుకోనివ్వడం లేదని, అక్కడ ఆర్టికల్ 370ని విధించారా? అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. బారామతి పట్టణంలో శనివారం ఫడ్నవీస్ యాత్ర సందర్భంగా తాము నినాదాలిస్తే పోలీసులు లాఠీచార్జి చేశారని కొంత మంది ఎన్‌సీపీ కార్యకర్తలు చేసిన ఆరోపణలను విలేఖరులు ప్రస్తావించగా ఫడ్నవీస్ పైవిధంగా స్పందించారు. పోలీసులు తాము లాఠీచార్జి చేసినట్టు చేసిన ఆరోపణలను అంతకు ముందు ఖండించారు. ‘నిరసన వ్యక్తం చేసినప్పుడు అక్కడ ఎంత మంది (ఎన్‌సీపీ కార్యకర్తలు) ఉన్నారనేది నా తొలి ప్రశ్న.. అక్కడ కేవలం ఏడుగురు ఉన్నారు. ఏడుగురిపై లాఠీచార్జి చేయాల్సిన అవసరం పోలీసులకు ఎందుకుంటుంది?’ అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. పోలీసులు వెంట పడగానే వారు పారిపోయారని ఆయన చెప్పారు. ‘శరద్ పవార్ నిర్వహించిన బహిరంగ సభలో మా పార్టీ కార్యకర్తలు గొడవ సృష్టిస్తే మీకు ఇష్టమేనా? అని నేను వారిని అడగదలచుకున్నాను.. ఇదేనా పద్ధతి?’ అని ఫడ్నవీస్ అన్నారు. బారామతిలో ఇతర పార్టీలు ర్యాలీలు నిర్వహించకూడదనే నిబంధనలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. ‘బారామతిలో ఆర్టికల్ 370ని విధించారా? లేక బారామతి మహారాష్ట్ర నుంచి వేరుపడిందా?’ అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. బీజేపీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లోకి ప్రతిపక్షాలు వస్తే వారికి తమ పార్టీ సహకరిస్తుందని ఆయన అన్నారు.
*చిత్రం...మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో ఆదివారం జరిగిన ‘మహా జనాదేశ్’ యాత్రలో ముఖ్యమంత్రి ఫడ్నవిస్