జాతీయ వార్తలు

బాధితులను ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ వెల్లడించారు. రాష్ట్రంలోని వరద పీడిత ప్రాంతాలైన కోటా, ఝాల్వార్, బుండి, ధోల్‌పూర్ జిల్లాల్లో సోమవారం ఆయన ఏరియల్ సర్వే జరిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్‌తో కలిసి రాష్ట్ర విపత్తులు, పునరావాస కార్యక్రమాల మంత్రి భన్వర్‌లాల్ మెఘ్వాల్, పట్టణాభివృద్ధి, హౌసింగ్ మంత్రి శింతి ధారివాల్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే తరువాత కోటలో సీఎం విలేఖరులతో మాట్లాడుతూ బిహార్, అస్సాంతో పోల్చుకుంటే వరద తీవ్రత అంత ఎక్కువకాదని పేర్కొన్నారు. అయితే బాధితులను అన్ని విధాలా ఆదుకోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. వరదల వల్ల మూడు నాలుగు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని సీఎం స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని గెహ్లోట్ ప్రకటించారు. గతం కంటే 40 శాతం వర్షపాతం ఈసారి ఎక్కువని, రాష్ట్రంలో 54 మంది చనిపోయారని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ జలాశయాల నుంచి విడుదలవుతున్న వరద సరిహద్దులోని కోట, ఝాలావర్‌ను ముంచెత్తిందని ఆయన అన్నారు. వరద పరిస్థితిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో గెహ్లోట్ మాట్లాడారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మంత్రులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద బాధితులను తక్షణం ఆదుకుంటామన్న గెహ్లోట్ అవసరమైతే కేంద్రాన్ని అదనపుసాయం కోరతామని స్పష్టం చేశారు. చిత్తోర్‌గఢ్‌లో ఓ పాఠశాల భవన్‌లో చిక్కుకుపోయిన 350 మంది విద్యార్థులు, 50 మంది ఉపాధ్యాయులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. హెలీకాప్టర్ ద్వారా వారిని అక్కడ నుంచి తరలిస్తామని ఆయన అన్నారు. చంబల్ నది సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నట్టు పట్టణాభివృద్ధి మంత్రి ధారివాల్ హామీ ఇచ్చారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ అదనపుముఖ్యకార్యదర్శి పీకే గోయల్ కోటలో ఉం సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.
*చిత్రం...రాజస్థాన్ సీఎం గెహ్లట్