జాతీయ వార్తలు

‘హౌడీ మోదీ’కి ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: అమెరికాలో భారతీయ-అమెరికన్ల ప్రాధాన్యతతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22న టెక్సాస్‌లోని హూస్టన్‌లో జరగనున్న భారతీయ-అమెరికన్ల సమావేశానికి హాజరయ్యేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించటం దీనికి నిదర్శనం. ‘హౌడీ మోదీ-షేర్డ్ డ్రీమ్స్, బ్రైట్ ఫ్యూచర్’ పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం ఏర్పాటు చేసిన సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ హాజరవుతారని అమెరికా అధ్యక్ష కార్యాలయం సోమవారం ప్రకటించింది. నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్న ఈ సమావేశానికి దాదాపు యాభై వేల మంది భారతీయ-అమెరికన్లు హాజరవుతున్నారు. డొనాల్ట్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న నేపథ్యంలో టెక్సాస్‌లోని హూస్టన్‌లో జరుగుతున్న భారతీయ-అమెరికన్ల సమావేశానికి మరింత ప్రాధాన్యత చేకూరింది. భారతీయ-అమెరికన్ల సమావేశానికి హాజరయ్యేందుకు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక స్నేహానికి ఇది నిదర్శమని మోదీ చెప్పారు. హూస్టన్‌లో జరగనున్న భారతీయుల సమావేశానికి డోనాల్ట్ ట్రంప్ హాజరవుతారంటూ అమెరికా అధ్యక్ష కార్యాలయంలో ఒక ప్రకటన జారీ చేసింది. భారత-అమెరికా దేశాల మధ్య నెలకొన్న సంబంధాల ప్రాధాన్యతను వివరించేందుకు హూస్టన్ సమావేశం ఒక ప్రత్యేక వేదిక, ప్రత్యేక అవకాశం అవుతుందని అమెరికా అధ్యక్ష కార్యాలయం పేర్కొన్నది. ప్రపంచంలోని పురాతన ప్రజాస్వామ్యం (అమెరికా), విశాల ప్రజాస్వామ్యం ( భారతదేశం) మధ్య నెలకొన్న కీలక భాగస్వామ్యాన్ని మరోసారి పునరుద్ఘాటించేందుకు హూస్టన్ సమావేశం దోహదపడుతుంది.
రెండు దేశాల మధ్య ఇంధన, వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని పేర్కొనటం గమనార్హం. ఇదిలాఉంటే హూస్టన్ సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా హాజరుకావటం అమెరికా సమాజానికి, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి భారతీయులు చేస్తున్న కృషికి అద్దం పడుతోందని నరేంద్ర మోదీ చెప్పారు. భారతదేశం- అమెరికా మధ్య నెలకొన్న ప్రత్యేక స్నేహానికి ట్రంప్ హాజరు ఒక నిదర్శమని మోదీ అభిప్రాయపడ్డారు. హూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఈ నెల 22న భారతీయులతో కలిసి డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించేందుకు ఎంతో ఆసక్తితో ఉన్నానని మోదీ ప్రకటించారు.
*ట్రంప్- నరేంద్ర మోదీ (ఫైల్‌ఫొటో)