జాతీయ వార్తలు

మంత్రి గారూ.. మీకిది తగునా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశంలో ఉద్యోగాల కొరత లేదని అయితే వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఉత్తర భారతీయుల్లో నైపుణ్యత కరవైందన్న కేంద్ర కార్మిక మంత్రి సంతోష్‌కుమార్ గాంగ్వార్ చేసిన వాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. గ్వాంగార్ ప్రకటనపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
‘మంత్రిగారూ కేంద్రంలో ఐదేళ్లు మీరు అధికారంలో ఉన్నారు. కొత్త ఉద్యోగాలు సృష్టించడం పోయి, ఉన్న ఉద్యోగాలే పోయాయి. మీ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు’అని ప్రియాంక మండిపడ్డారు. ఐదేళ్లు ఎలాంటి ఉపాధి కల్పనకూ చర్యలు తీసుకోకుండా ఉత్తర భారతీయులను అర్హతలేనివారిగా చిత్రీకరిస్తారా? అంటూ ఆమె ధ్వజమెత్తారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉత్తర భారతీయుల్లో అర్హులు లేరన్న మంత్రి ప్రకటన బాధ్యతరాహిత్యం అని కాంగ్రెస్ నాయకురాలు విమర్శించారు. ప్రియాంకతో పాటు పలువురు ప్రతిపక్ష నేతలూ గాంగ్వార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మంత్రి గారూ.. మీరు అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పరూ. గత ఐదేళ్లు, ఈ వంద రోజులు ఎందరికి ఉద్యోగాలు ఇచ్చారో లెక్క చెప్పండి. నైపుణ్య భారత్‌లో భాగంగా ఎంతమంది ఉత్తర భారతీయులకు ఉద్యోగాలు ఇచ్చారో సెవవివ్వండి‘అని ప్రియాంక డిమాండ్ చేశారు. కార్మిక మంత్రిపై విమర్శలు చేస్తూ ఆమె హిందీలో ట్వీట్‌లు చేశారు. దేశంలో నిరుద్యోగులు ఎందరున్నారో ఓ సారి గుర్తుచేసుకోండి అని ఆమె సలహా ఇచ్చారు. గ్వాంగార్ బరేలీలోవిలేఖరుతో మాట్లాడిన వీడియో కలకలం రేపింది. ఉన్నత పదవిలో ఉన్న గాంగ్వార్ ఉత్తరభారతీయులను తీవ్రంగా అవమానించారని ఆదివారం ఆమె విమర్శించారు. ఐదేళ్లూ కొత్తగా ఒక్క ఉద్యోగం కల్పించలేదు, సరికదా ఆర్థిక మాంద్యం వల్ల ఉన్న ఉద్యోగాలే పోతున్నాయని ప్రియాంకా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘మంత్రి గారూ మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే ఉత్తర భారతీయులపై నెపం మోపుతున్నారు’అని ఆమె ధ్వజమెత్తారు. ఉద్యోగాల కోసం యువత ప్రభుత్వం వైపుచూస్తోందని ఆమె పేర్కొన్నారు.