జాతీయ వార్తలు

రిజర్వేషన్లు అవసరమే కానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ్‌పూర్, సెప్టెంబర్ 16: సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న వారికి రిజర్వేషన్లు అవసరమే కానీ అదొక్కటే పూర్తిగా అభివృద్ధి చెందేందుకు దోహదపడదని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రగతి సాధనకు విద్య ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
మహాత్మా పూలే శిక్షణ్ సంస్థ సోమవారం నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ‘అఖిల భారతీయ మాలి సమాజ్ మహాదివేశన్’ కార్యక్రమంలో మంత్రి గడ్కరీ పాల్గొన్నారు. మంత్రి ప్రసంగించడానికి ముందు మాలి కులానికి చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ కులానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని కోరారు. అనంతరం మంత్రి గడ్కరీ ప్రసంగిస్తూ ప్రతి కులానికి చెందిన వారూ ఇటువంటి డిమాండ్‌నే చేస్తుంటారని అన్నారు. ఎవరికైనా ప్రజలకు చేసిన సేవలు, వ్యక్తిగత ప్రతిష్ట వల్లే గుర్తింపు లభిస్తుందన్నారు.
కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండేజ్‌ది ఏ కులం? అని ఆయన సభికులను ప్రశ్నించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీది ఏ కులం? ఆమె కుల ప్రాతిపదికగానే ఎదిగారా? అని ఆయన ప్రశ్నించారు. మహిళలు రిజర్వేషన్లు కోరుతున్నారు, అలా కోరడం మంచిదే కానీ, ఇందిరా గాంధీ రిజర్వేషన్ వల్లే రాజకీయాల్లో రాణించారా? అని మంత్రి గడ్కరీ ప్రశ్నించారు. సమాజంలో వెనుకబడిన వారికి, దళితులకు రిజర్వేషన్లు కల్పించడంలో తప్పులేదన్నారు.