జాతీయ వార్తలు

‘ఆయుష్మాన్ భారత్’లో అవినీతి సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఆయుష్మాన్ భారత్) పథకంలోని ప్యానల్ ఆసుపత్రులు అవినీతికి పాల్పడితే క్షమించేది లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ హెచ్చరించారు. మంగళవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి హర్షవర్దన్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ ప్యానల్ ఆసుపత్రులు అవినీతికి పాల్పడినట్లు రుజువైతే వారి పేర్లను అధికారిక వెబ్‌సైట్‌లో ‘నేమ్ అండ్ షేమ్’గా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇంతవరకు సుమారు 1200 ఆసుపత్రులు అవినీతికి పాల్పడినట్లు తేలగా.. 338 ఆసుపత్రులపై చర్యలు తీసుకొన్నట్లు ఆయన చెప్పారు. అవినీతి రహితంగా సేవలందించడమే ధ్యేయంగా ఆయుష్మాన్ భారత్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందనీ.. ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అవినీతి రుజువైన ఆసుపత్రులపై సివిల్, క్రిమినల్ కేసులను సైతం బనాయించనున్నట్లు మంత్రి హర్షవర్దన్ హెచ్చరించారు. ముఖ్యంగా అవినీతికి పాల్పడినట్లు తేలిన ఆసుపత్రుల పేర్లను అధికారిక వెబ్‌సైట్ ‘ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన’ (ఆయుష్మాన్ భారత్)లో ఆసుపత్రి వివరాలను ప్రకటిస్తూ ‘నేమ్ అండ్ షేమ్’గా ప్రజలకు తెలియజేసేలా చేస్తామని హెచ్చరించారు. వారి పేర్లను ప్యానల్ ఆసుపత్రుల లిస్టు నుంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని దుర్వినియోగం చేసే ఆసుపత్రులపై చర్యలు తీసుకొనే బాధ్యత తమపై ఉందని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఇందుభూషణ్ స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. కేవలం ఆయుష్మాన్ భారత్ ప్యానల్ నుంచి మాత్రమే కాదు సీజీహెచ్‌ఎస్, ఈసీహెచ్‌ఏల నుంచి కూడా ఆయా అవినీతి ఆసుపత్రులను తొలగించేలా చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన ఆరోపణలపై 376 ఆసుపత్రులపై జాతీయ ఆరోగ్య అథారిటీ విచారణ జరుపుతోందనీ.. ఇప్పటికే వాటిపై షోకాజ్ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. మరో 338 ఆసుపత్రులను ప్యానల్ లిస్టు నుంచి తొలగించి జరిమానా విధించినట్లు మంత్రి హర్షవర్దన్ వివరించారు. 1200 ఆసుపత్రులు అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ జరిగిందనీ.. వాటికి 1.5 కోట్ల రూపాయిల జరిమానా విధించినట్లు వివరించారు. ‘అవినీతి రహిత పరిపాలనే ధ్యేయంగా దుర్వినియోగానికి పాల్పడిన ఆసుపత్రులపై చర్యలు తీసుకొంటున్నామని’ మంత్రి స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించి ఈనెల 23వ తేదీకి సంవత్సరం పూర్తయిన సందర్భంగా 15 నుంచి 30వ తేదీ వరకు ‘ఆయుష్మాన్ భారత్ పక్వారా’ పేరుతో పలు కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. 29, 30 తేదీల్లో ‘గ్యాన్ సంగం’ పేరుతో జాతీయ స్థాయిలో భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ వెల్లడించారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌లో సైతం వీటిని అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వివరించారు.