జాతీయ వార్తలు

యురేనియం తవ్వకాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: పర్యావరణ పరిరక్షణకు, వన్యప్రాణుల రక్షణకు భారత్ కట్టుబడి వుందని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతిస్తున్నారని జనసేన నాయకుడు పెంటపాటి పుల్లారావు విమర్శించారు. తెలంగాణలో ‘సేవ్ నల్లమల’ పేరుతో సాగుతున్న నిరసనలకు బాసటగా పలువురు ఢిల్లీ వాసులు, మంగళవారం ఇండియా గేట్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ యురేనియం కోసం వేల బోర్లు వేస్తూ దాన్నో వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. ఇటీవల ఎడారులపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ప్రధాన మంత్రి మోదీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. దీనిపై డాక్టర్ అనంద్ మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపట్టం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర రావు, సాగర్‌బాబు, సతీష్, అరుణ, ప్రదీప్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.