జాతీయ వార్తలు

వలసలతో కుదేలవుతున్న కాంగ్రెస్-ఎన్‌సీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 17: కాంగ్రెస్-ఎన్‌సీపీలకు ఒకప్పుడు కంచుకోటగా ఉన్న మహారాష్టల్రో క్రమంగా బీజేపీ-శివసేన పాగా వేస్తున్నాయా? మరాఠా ‘స్ట్రాంగ్‌మేన్’గా గుర్తింపు పొందిన శరద్‌పవార్ క్రమంగా బలహీనపడుతున్నారా? అంటే ఔననే చెప్పాల్సి వస్తోంది. ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరుతున్నట్లే కనిపిస్తోంది. మహారాష్టల్రో క్రమంగా భారతీయ జనతాపార్టీ ‘చాప కింద నీరు’లా విస్తరించుకుంటూ పోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్టన్రు మళ్లీ కైవసం చేసుకొని అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలన్న ఆ పార్టీ ఆరాటానికి మరింత బలం చేకూరే విధంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గోచరిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ - ఎన్‌సీపీలకు చెందిన కనీసం డజను మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పార్టీలను వీడి బీజేపీ-శివసేనల తీర్థం పుచ్చుకోవడాన్ని చూస్తుంటే పరిస్థితి ‘చే’జారిపోతున్నట్లు కనిపిస్తోంది. 2014 ఎన్నికలకు ముందు 15 సంవత్సరాల పాటు ఏకచ్ఛ్ధాపత్యంగా మహారాష్టన్రు ఏలిన కాంగ్రెస్ - ఎన్‌సీపీలు ఇక అధికారంపై ఆశ వదులుకోవాల్సిన పరిస్థితే కనపడుతోంది. 2014లో 288 స్థానాల్లో బీజేపీ 122 సీట్లు సాధించి అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అవతరించగా శివసేన 63 సీట్లు గెలిచి ఇరు పార్టీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసిందే.