జాతీయ వార్తలు

ఫరూక్‌పై పీఎస్‌ఏనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ప్రజా భద్రతా చట్టం(పీఎస్‌ఏ)కింద నిర్బంధించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తప్పుపట్టారు. ఫరూక్‌ను కోర్టులో హాజరుపరచాలని తమిళనాడు ఎండీఎంకే చీఫ్ వైగో సుప్రీంను ఆశ్రయించినందునే కేంద్రం ఈనిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. కాశ్మీర్‌లో అర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి అబ్దుల్లాను గృహ నిర్బంధంలోనే ఉంచారు. సోమవారం వైగో పిటిషన్ విచారణకు రానున్న సందర్భంలో కేంద్రం ప్రజా భద్రతా చట్టం ప్రయోగించింది. ఫరూక్ ఇంటినే జైలుగా మారుస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఐదుసార్లు ఎంపీగా, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫరూక్ అబ్దుల్లా (81)ను పీఎస్‌ఏ చట్టం కింద రెండు నెలల పాటు విచారించడానికి వీల్లేదు. జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసిన 43 రోజులవుతోందని ఇప్పుడు ఫరూక్‌పై అక్రమ నిర్బంధం దారుణమని, కక్షసాధింపని సిబల్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సిబల్ ట్వీట్లు చేశారు. ‘ జమ్మూకాశ్మీర్‌లో 92 శాతం మంది ప్రజలు ఆర్టికల్ 370 రద్దును ఆహ్వానిస్తున్నారని బీజేపీ చెబుతోంది. అక్కడ సాధారణ పరిస్థితుల నెలకొన్నాయని ప్రచారం చేస్తోంది. పార్లమెంట్ వద్ద హోం మంత్రి అమిత్‌షా అయితే అసలు ఫరూక్ అబ్దుల్లాను నిర్బంధించడం లేదా అరెస్టు చేయడం జరగలేదని చెప్పారు’అని కాంగ్రెస్ నేత గుర్తుచేశారు. ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పులేనప్పుడు వైగో పిటిషన్ అంటే భయమెందుకు?అని ఆయన నిలదీశారు. కాగా వైగో పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్రం, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఫరూక్ అబ్దుల్లాను కోర్టులో హాజరుపరచాలన్న ఎండీఎంకే అధినేత పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్, న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, ఎస్‌ఏ నజీర్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిన కోర్టు కేసు తదుపరి విచారణను ఈనెల 30కు వాయిదా వేసింది.