జాతీయ వార్తలు

మరో ఉద్దీపన ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచేందుకు కేంద్రం మరో ఉద్దీపన ప్రణాళికను సిద్ధం చేసినట్టు సమాచారం. ప్యాకేజీల వివరాలను ఒకటి రెండు రోజుల్లోనే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. గత ఆరేళ్లలో ఎన్నడూ లేని రీతిలో స్థూల జాతీయోత్పత్తి 5 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యం తప్పని పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో, కేంద్రం ఇప్పటికే మూడు ఉద్దీపన కార్యాచరణ చర్యలకు శ్రీకారం చుట్టింది. మొదటి అడుగుగా, అతి సంపన్న వర్గాలపై ప్రకటించిన భారీ పన్నులను వెనక్కు తీసుకుంది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అతి సంపన్న వర్గాల ఆదాయంపై పన్నును భారీగా పెంచారు. ఆదాయం 2 నుంచి 5 కోట్ల రూపాయలు ఉన్న వారికి విధిస్తున్న పన్నును 15 నుంచి 25 శాతానికి పెంచారు. అదే విధంగా 5 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వారి పన్నును 37 శాతానికి పెంచేశారు. మొదటి టారిఫ్‌లో ఉన్న వారి పన్ను 3.12 నుంచి 7 శాతానికి పెరిగితే, రెండో టారిఫ్‌కి వచ్చేవారి పన్ను 39 నుంచి 42.74 శాతానికి పెరిగింది. చట్టం ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ)తోపాటు, వివిధ సంఘాలు కూడా వ్యక్తుల కిందకే వస్తాయి. కేంద్ర నిర్ణయం సహజంగానే విదేశీ పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు చేపట్టిన చర్యల్లో మొదటగా, ఈ పన్ను పెంపక నిర్ణయాన్ని కేంద్రం గత 22న వెనక్కు తీసుకుంది. ఆతర్వాత 30న ప్రభుత్వ రంగంలోని వివిధ కీలక బ్యాంకుల విలీనం ప్రకటన చేసింది. ఈ తాజా నిర్ణయంతో యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ తదితర బ్యాంకులన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో విలీనమయ్యాయి. ఫలితంగా, ఎస్‌బీఐ తర్వాత దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పీఎన్‌బీ అవతరించింది. కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లో అలహాబాద్ బ్యాంక్ విలీనమయ్యాయి. కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా అవతరించాయి. కాగా, ఇటీవలే ఎగుమతులు, నిర్మాణ రంగాలకు కేంద్రం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. మూడో ఉద్దీపన చర్యగా, ఏకంగా 70,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఖాయం చేసింది.

*చిత్రం... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్