జాతీయ వార్తలు

ఉదారంగా వరద సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: తెలంగాణలో హైదరాబాద్‌సహా అన్ని జిల్లాల్లో అకాల వర్షాలతో తీవ్ర నష్టం జరిగిందని, వౌలిక వసతులను మెరుగుపరచడానికి రూ. 1,129 కోట్లు సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గురువారం నాడు ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు కేంద్రమంత్రులు చౌదరీ బీరేంద్ర సింగ్, సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడులతో భేటీ అయ్యారు. వెంకయ్యనాయుడుతో సమావేశం అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ తెలంగాణలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలు, అక్కడి పరిస్థితి గురించి వివరించినట్టు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు ఇతర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు, వరదలవల్ల జరిగిన నష్టాలపై ఒక నివేదికను వెంకయ్యనాయుడుకి అందించినట్లు చెప్పారు. నష్టం అంచనాను విభాగాలవారీగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖకు అందిన నివేదిక అధారంగా తప్పక తెలంగాణకు సాయం చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్య హామీ ఇచ్చారని కెటిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరదల సమయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపినట్టు ఆయన చెప్పారు. ముఖ్యంగా నాలాలపై అక్రమ కట్టడాల కూల్చివేతలో వెనక్కి తగ్గేది లేదని ఆయన పునరుద్ఘాటించారు. అక్రమ కట్టడాల తొలిగింపులో సొంత పార్టీ నేతలకు చెందిన కట్టడాలు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. తప్పుల దిద్దుబాటులో భాగంగా గతంలో జీహెచ్‌ఎంసి అనుమతులు ఇచ్చిన భవనాలను కూడా తొలిగిస్తున్నట్టు చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా మున్సిపాలిటీలలో ఇప్పటికి వెయ్యికిపైగా అక్రమ కట్టడాలను తొలిగించినట్టు ఆయన వెల్లడించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 500కుపైగా అక్రమ కట్టడాలను తొలగించినట్టు కెటిఆర్ తెలిపారు. చివరి అక్రమ నిర్మాణం కూలిపోయే వరకు అక్రమాణల తొలిగింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లను కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయకపోవడానికి హేతుబద్ధత లేకపోవడమేనని కెటిఆర్ చెప్పారు. జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న తెలంగాణకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరీ బీరేంద్రసింగ్ ను కెటిఆర్ కోరారు. ఈ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని, ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తామని బీరేంద్రసింగ్ హామీ ఇచ్చినట్టు చెప్పారు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర రైల్యేశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో ముందుకు వెళ్తామని రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభు అన్నారు. కెటిఆర్ సురేష్ ప్రభును ఆయన కార్యాలయంలో కలిశారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఇప్పటికే రెండుసార్లు చర్చించానని, పరస్పర సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని అడ్డంకులను అధిగస్తామని సురేష్ ప్రభు స్పష్టం చేశారు.
కాగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులపై కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం ఒక శాంతికాముక దేశంగానే కాకుండా అవసరమైనప్పుడు ప్రతిదాడులు కూడా చేయగలుగుతుందని ఈ దాడుల ద్యారా ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు.

చిత్రం.. ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కలిసిన రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్