జాతీయ వార్తలు

ఆంక్షలు సడలించినా.. కానరాని పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 21: కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో శనివారం ఆంక్షలు సడలించినట్టు అధికారులు వెల్లడించారు. కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో ఆంక్షలు సడలించినట్టు తెలిపారు. అయితే భద్రతా కారణాలు దృష్ట్యా ముందు జాగ్రత్తగా పోలీసుల మోహరింపుకొనసాగింది. కాగా శుక్రవారం నాడు ప్రత్యేక ప్రార్థనలు సందర్భంగా కాశ్మీర్ లోయలోని కొత్త ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్టు అధికారులు పేర్కొన్నారు. పెద్ద మసీదులు, పెట్రోల్ బంకుల వద్ద పెద్ద జనం సమర్ధం బాగా పెరగడంతో ముందు జాగ్రత్తగా ఆంక్షలు అమలు చేశారు. అయితే కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు సడలించినట్టు వారన్నారు. అయితే బలగాలు మోహరింపుమాత్రం కొనసాగుతునే ఉందని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం 144వ సెక్షన్ అమల్లో ఉంచారు. సున్నితమైన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత కొనసాగుతోంది. మొబైల్, ఇంటర్నెట్ సేవలు రద్దయ్యాయి. ఆర్టికల్ 370 రద్దయి 48 రోజులైనా పరిస్థితితోపెద్దగా మార్పు కనిపించడం లేదని స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 5న తొలిసారి ఆంక్షలు విధించింది కాశ్మీర్ లోయలోనే. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలను పెద్ద మసీదుల్లో అనుమతించడం లేదు. నౌహట్టాలోని జామియా మసీదు, హజ్రత్‌బాల్‌లోని దర్గా షరీఫ్‌లో ప్రార్థనలు జరగడం లేదు. శనివారం కూడా లోయలో ప్రజాజీవనం స్తంభించింది. ఎక్కడా మార్కెట్లు తెరుచుకోలేదు. విద్యా సంస్థల పరిస్థితీ అంతే. రోడ్లపై వాహనాలు కనిపించలేదు. అన్ని రకాలైన ఇంటర్నెట్ సౌకర్యాలు నిషేధించారు. మొబైల్ ఫోన్ల వాయిస్ కాల్స్ మాత్రం పనిచేస్తున్నాయని అధికారులు అన్నారు. విద్యా సంస్థలు తెరవాలని ప్రభుత్వం భావించినా పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు సుముఖంగా లేరు. రాజకీయ పార్టీల ప్రముఖ నేతలందరూ పోలీసుల ఆధీనంలోనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దులా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం కొనసాగుతోంది. ఫరూక్ అబ్దుల్లానైతే ఏకంగా ప్రజాభద్రతా చట్టం కింద ఇంటి జైలుకు పరిమితం చేశారు. మంగళవారం నుంచే ఇది అమలవుతోంది. ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, శాసన సభ్యులు గృహ నిర్బంధంలోనే ఉన్నారు.
*చిత్రం...పర్యాటకులు లేక కునుకు తీస్తున్న దాల్ లేక్ సరస్సులో పడవులు నడిపే షికారీలు