జాతీయ వార్తలు

ప్రత్యూష మరణంలో గృహహింస కోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 2: ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ టెలివిజన్ నటి ప్రత్యూష బెనర్జీ వ్యక్తిగత జీవితం సాఫీగా లేదని ఆమె మిత్రులు కొందరు చెబుతున్నారు. ప్రత్యూష ముక్కుపైన, కళ్ల కింద గాయాల గుర్తులు ఉన్నాయని, సాక్ష్యాధారాల కోసం వీటిని ఫొటోలు తీశామని, గృహ హింస కోణంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వీటిని చూపించడంతో పాటు అవసరమైతే వాంగ్మూలం కూడా ఇస్తామని ప్రత్యూష స్నేహితురాలు, మరో నటి కామ్యా పంజాబీ శనివారం ముంబయిలో విలేఖర్లకు తెలియజేసింది. ‘మిత్రులుగా ప్రత్యూషను ప్రతిరోజూ కలిసే వాళ్లం. వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న ఆమె మా నుంచి దూరంగా జరిగింది. ప్రత్యూషకు ఏమి జరిగిందో కచ్చితంగా తెలియదు. కానీ ఆమె తన కుటుంబానికి కూడా దూరంగా ఉంటోంది. దీనినిబట్టి చూస్తే ఆమె ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది’ అని వికాస్ గుప్తా చెప్పారు. కాగా, ప్రత్యూషకు ఆర్థిక సమస్యలు ఉన్నట్లు వస్తున్న వార్తలను కామ్యాతో పాటు మరో నటి స్మితా బన్సాల్ కూడా తోసిపుచ్చారు. ‘ఆమెకు ఆర్థిక సమస్యలేమీ లేవు. మమ్మల్ని ఎప్పుడూ డబ్బు అడగలేదు. ఇటీవల ప్రత్యూష ఒక రియాల్టీ షో కూడా చేసింది’ అని కామ్యా పేర్కొంది. ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌ను వివాహం చేసుకునేందుకు ప్రత్యూష ఎంతో ఉత్సుకతతో ఉందని, పక్షం రోజుల క్రితం వారిద్దరూ తమతో మాట్లాడినప్పుడు ఈ విషయం స్పష్టమైందని మరో నటి సురభి ఛటర్జీ తెలిపింది.
ప్రత్యూష ఆత్మహత్య కేసులో పోలీసులు శనివారం ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్‌ను ప్రశ్నించారు. ముంబయి శివారు గోరెగావ్‌లోని బంగుర్ నగర్ నివాసంలో శుక్రవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఈ కేసుకు సంబంధించి రాహుల్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నామని, అలాగే ప్రత్యూష ఆత్మహత్యకు ముందు ఆమెకు, రాహుల్‌కు మధ్య చివరిసారిగా సాగిన టెలిఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లను కూడా పరిశీలిస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యూష మృతదేహానికి గోరెగావ్‌లోని సిద్ధార్థ్ మున్సిపల్ ఆసుపత్రిలో శవ పరీక్ష నిర్వహించారు. అయితే రాహుల్‌ను నిర్బంధించకపోయినప్పటికీ అతడిని ఆ ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యూష మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆమె తల్లిదండ్రులు కూడా జైపూర్ నుంచి ఆ ఆసుపత్రికి వచ్చారు. శుక్రవారం సాయంత్రం దాదాపు 5 గంటల సమయంలో ప్రత్యూష ‘ఎట్ హార్మనీ’ భవనంలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టం చేస్తున్నాయని, ఆ తర్వాత ప్రత్యూషను ఆమె మిత్రుడు అంధేరీలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించగా, ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యూష ఫ్లాట్‌లో ఆత్మహత్య లేఖ (సూసైడ్ నోట్) ఏదీ లభించలేదని, ఆమె మృతికి అసలు కారణం ఏమిటన్నదీ శవ పరీక్ష పూర్తయిన తర్వాతే వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. రాహుల్ రాజ్‌తో సంబంధం పెట్టుకున్నందుకు ప్రత్యూష ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వాట్సప్‌లో ప్రత్యూష చివరిసారి పోస్టు చేసిన సందేశంలో ‘చనిపోయిన తర్వాత కూడా నీ నుంచి చూపు మరల్చను’ అని ఉంది.
ప్రత్యూషకు కన్నీటి వీడ్కోలు
ప్రత్యూషకు శనివారం ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఒషివరా శ్మశాన వాటికలో సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు జరిగాయి. కామ్యా పంజాబీ, స్మితా బన్సాల్, ఇజాజ్ ఖాన్, రతన్ రాజ్‌పుట్, సరా ఖాన్, పూజా బోస్, శిల్పా సక్లానీ, అపూర్వ అగ్నిహోత్రి, జై భన్సాలీ, మహీ విజ్ తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. ‘నా కుమార్తె ఎందుకు చనిపోయిందో తెలియడం లేదు’ అంటూ విలపిస్తున్న ప్రత్యూష తల్లిని ఎవరూ ఓదార్చలేకపోయారు.