జాతీయ వార్తలు

ఉద్యోగులకు 17 శాతం డీఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు దీపావళి కానుకగా పదిహేడు శాతం కరవు భత్యాన్ని (డీఏ) ప్రకటించింది. ఆశా వర్కర్ల వేతనాన్ని కూడా వెయ్యి నుంచి రెండువేల రూపాయలకు పెంచింది. నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు పదిహేడు శాతం కరవు భత్యాన్ని ఈ సంవత్సరం జూలై నుంచి అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం మామూలుగా అయితే పనె్నండు శాతం కరవు భత్యం చెల్లిస్తుంది. అయితే మోదీ ప్రభుత్వం కరవు భత్యాన్ని పనె్నండు శాతం నుండి పదిహేడు శాతానికి పెంచి సంచలనం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎప్పుడు కూడా కరవు భత్యాన్ని ఒకేసారి ఐదు శాతం పెంచలేదు. ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అరవై ఐదు లక్షల మంది పెన్షన్‌దారులకు ప్రయోజనం కలుగుతుంది. అయితే కరవు భత్యం మూలంగా కేంద్ర ప్రభుత్వంపై పదహారు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మంత్రివర్గం సమావేశానంతరం విలేఖరులకు ఈ విషయం చెప్పారు. ఇలావుండగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం కిసాన్)కి ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం పొడిగించింది. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆరువేల రూపాయల అందజేస్తారు.
ఆధార్ అనుసంధానం గడవును నవంబర్ 30 వరకూ పొడిగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకున్నారు. పీఎం కిసాన్ కింద లబ్ధి పొందాలంటే ఆధార్ అనుసంధానం తప్పనిసరని జావడేకర్ తెలిపారు. రబీలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్న ఉద్దేశంతో గడువును పెంచినట్టు ఆయన చెప్పారు. కాగా ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద దేశంలో ఏడు కోట్ల మంది రైతులు ఇప్పటికే ప్రయోజనం పొందారని ఆయన స్పష్టం చేశారు. ఆరువేల రూపాయలను మూడు విడతలుగా అందచేసినట్టు పేర్కొన్నారు.