జాతీయ వార్తలు

రాహుల్ నిర్ణయం.. పార్టీకి తీరని నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: అధినాయకుల అలసత్వం మూలంగా కాంగ్రెస్ మనుగడ ప్రమాదంలో పడిపోయిందని సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖుర్షీద్ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్నది సమస్య కాదు.. కాంగ్రెస్ పార్టీ మనుగడ ఉంటుందా? అనేది ఇప్పుడు తాము ఎదుర్కొంటున్న అసలు సమస్య అంటూ ఆయన పార్టీ దీనావస్థ గురించి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి దారితీసిన పరిస్థితుల గురించి సమీక్షించే బదులు మా నాయకుడు రాహుల్ గాంధీ వాకౌట్ చేసి వెళ్లిపోయాడు, దీనివలన పార్టీకి తీరని నష్టం కలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయిన తరువాత సోనియా గాంధీ తాత్కాలికంగా పార్టీ బాధ్యతలు చేపట్టారు, ఆమె స్థానంలో కొత్త నాయకుడిని అధ్యక్షుడుగా ఎన్నుకునేందుకు అమలు చేయవలసిన ప్రక్రియ ఇంతవరకు ప్రారంభం కాలేదని ఆయన చెప్పారు. సోనియా గాంధీ మరో మూడు నెలల్లో తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాకపోవటం సీనియర్ నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది. రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగటం ఒక్కటే తమ ముందున్న దారని సల్మాన్ ఖుర్షీద్ అంటున్నారు. అయితే ఆయన చెబుతున్న ఈ అభిప్రాయంతో చాలామంది సీనియర్ నాయకులు ఏకీభవించటం లేదు. రాహుల్ మూలంగానే కాంగ్రెస్ మరణ శయ్యపైకి ఎక్కినప్పుడు ఆయననే మళ్లీ అధ్యక్షుడిగా ఎలా నియమించుకుంటామన్నది వారి ప్రశ్న. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకావటానికి గల కారణాలను నిర్దారించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవటంలో తీవ్రమైన జాప్యం జరిగిందని సల్లాన్ ఖుర్షీద్ చెప్పారు. రాహుల్ గాంధీ అకస్మాత్తుగా రాజీనామా చేసి వెళ్లిపోవటం వలన ఏర్పడిన ఖాళీ భర్తీ కావటం లేదని ఆయన చెబుతున్నారు. సోనియా గాంధీ తనను తాను తాత్కాలిక అధ్యక్షురాలిగానే భావిస్తున్నారు. ఈ పరిస్థితి మారకపోతే కాంగ్రెస్ మనుగడకు ప్రమాదం వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇదిలాఉంటే మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొనే పక్షంలో పార్టీ దిక్కూ.. దివాణం లేకుండా పోతుందని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు బీజేపీ, ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు, ఎన్నికల అనంతరం మిగతా నాయకులు కూడా బైటికి వెళ్లిపోతే కాంగ్రెస్ మనుగడ ప్రమాదంలో పడిపోతుందని వారంటున్నారు. కాంగ్రెస్ కోశాధికారి అహమద్ పటేల్, హర్యానా ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ తదితర సీనియర్ నాయకులు కూడా అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఈ నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లలేరు కాబట్టే కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ వర్గానికి సీనియర్ నాయకులకు మధ్య కొనసాగుతున్న ప్రచ్చన్న యుద్ధం తారస్థాయికి చెరుకున్నది.. ఈ సమస్యను పరిష్కరించడం పట్ల సోనియా గాంధీ ఎలాంటి చొరవ చూపించటం లేదు. అందుకే రెండు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో ఎలాంటి తీవ్ర పరిణామాలు తలెత్తుతాయోనని సీనియర్లు తల పట్టుకుంటున్నారు.

*చిత్రాలు.. రాహుల్ గాంధీ
*సల్మాన్ ఖుర్షీద్