జాతీయ వార్తలు

7.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దిగుమతి చేసుకున్న యూరియా కంటే స్థానికంగా ఉత్పత్తి చేసిన యూరియాను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడను కోరారు. నిరంజన్ రెడ్డి బుధవారం సదానంద గౌడను కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. తాము కోరిన విధంగా కేంద్రం ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని ఆయన చెప్పారు. ఈసారి ఖరీఫ్ సీజన్ ఆలస్యమైందని.. వర్షాలు సమృద్ధిగా కురవడంతో సాగునీటి ప్రాజెక్టులు నిండి విస్తీర్ణం పెరిగిందని రాష్ట్ర మంత్రి చెప్పారు. రాష్ట్రంలో కోటీ పది లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి, ఇతర ప్రధాన పంటలు సాధారణం కన్నా 108 శాతం నుండి 132 శాతం సాగు నమోదు చేశాయని అన్నారు. రబీలో సాధారణ విస్తీర్ణం కన్నా 8.5 లక్షల ఎకరాలు పెరిగి సుమారు 42 లక్షల
ఎకరాలు సాగయ్యే అవకాశం ఉన్నదని అన్నారు. వరి సాగు విస్తీర్ణం మరింత ఎక్కువ పెరుగుతోందని నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, చెరువులు నిండిపోవడంతో ఈ రబీ సీజన్‌లో ఎరువుల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తాము గతంలో విజ్ఞప్తి చేసిన విధంగా 7.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. దీనితోపాటు అక్టోబర్ మాసానికి కేటాయించిన 1.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ నెల 20లోగా పంపించాలని కేంద్ర మంత్రిని కోరారు. 2020 మార్చి నాటికి రామగుండం ఎరువుల కార్మాగారం ట్రయల్ రన్ అవుతుంది.. ఆ తరువాత ఖరీఫ్ నుండి దక్షిణాది రాష్ట్రాలకు అక్కడి నుంచి ఎరువురు సరఫరా చేస్తామని సదానంద్ గౌడ హామీ ఇచ్చినట్లు నిరంజన్ రెడ్డి చెప్పారు.