అంతర్జాతీయం

ఉగ్రవాదానికి సాయంపై సమష్టి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, అక్టోబర్ 10: ఉగ్రవాదానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు అందుతున్న సాయంపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్), ఐక్యరాజ్య సమితి (యూఎన్)కు భారత్ పిలుపునిచ్చింది. ఈ రెండు సంస్థలు పరస్పర సహకారంతో ముందుకు వెళితే, ఉగ్రవాదులకు అందుతున్న సాయాన్ని నిలిపివేయడం ద్వారా, ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనవచ్చని పేర్కొంది. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై జరిగిన సాధారణ సభ సమావేశంలో పాల్గొన్న యూఎన్‌కు భారత శాశ్వత ప్రతినిధి ఎడ్ల ఉమాశంకర్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో మరో ఆలోచనకు తావు లేదని స్పష్టం చేశారు. ఎఫ్‌ఏటీఎఫ్, యూఎన్ పరస్పర అవగాహన, సహకారం, ఏకాభిప్రాయం, సానుకూల నిర్ణయాల ద్వారానే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశాలకు ఆర్థిక సాయం అందించడమంటే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని ఉమాశంకర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, దానిని భారత్ ఏ మాత్రం ఉపేక్షించబోదని ఆయన తేల్చిచెప్పారు. ముంబయిపై జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రధాన సూత్రధారుడైన జైషే ఉద్‌దవా చీఫ్ హఫీజ్ సరుూద్‌కు అతని ఖాతాల్లో నుంచి సొమ్మును తీసుకునే వీలును కల్పిస్తూ యూఎన్ భద్రతా మండలి ఇటీవలే తీసుకున్న నిర్ణయంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సాధారణ ఖర్చుల పేరుతో, బ్యాంకుల నుంచి తీసుకునే సొమ్ముతో అతను తన కార్యకపాలాలను మరింతగా పెంచుతాడన్న అనుమానం వ్యక్తం చేసింది.
ఉగ్రవాద కార్యకలాపాల్లో పాత్ర ఉన్న వారి ఖాతాలను, ఆస్తులను స్తంభింప చేయాలని యూఎన్ 2008 డిసెంబర్‌లో తీర్మానించింది. అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేసి, ఆయా వ్యక్తులు లేదా సంస్థల ఖాతాల లావాదేవీలను నిలిపివేయాలని ప్రపంచ దేశాలను కోరింది. అయితే, దైనందిన ఖర్చుల పేరుతో హఫీజ్ సరుూద్‌కు సొమ్మును విడ్‌త్రా చేసుకునే అవకాశం కల్పించడం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్టే అవుతుందని ఉమాశంకర్ అన్నారు. ఎఫ్‌ఏటీఎఫ్ జాబితాలోని ప్రతి ఒక్కరి ఖాతాలు స్తంభింప చేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యూఎన్‌పై ఉందని వ్యాఖ్యానించారు. ఎఫ్‌ఏటీఎఫ్, యూఎన్ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొని, కూకటివేళ్లతోసహా పెకళించడానికి అన్ని దేశాలు కృషి చేయాలని చెప్పారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కేవలం భారత్‌కేగాక, యావత్ ప్రపంచానికి కూడా ప్రమాదకరంగా మారుతున్నదని అన్నారు.