జాతీయ వార్తలు

వందేమాతరం నిజమైన జాతీయ గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 2: రాజ్యాంగం జాతీయ గీతంగా గుర్తించిన ‘జనగణ మన’కన్నా కూడా ‘వందేమాతరం’ నిజమైన దేశభక్తి గీతమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషీ అన్నారు. కొద్ది రోజుల క్రితం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రతి ఒక్కరూ ‘్భరత్ మాతాకీ జై’ అనాలంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పుడు జోషీ జనగణనకన్నా కూడా వందేమాతరమే నిజమైన జాతీయ గీతమని చేసిన వ్యాఖ్యలు ఎలాంటి వివాదాన్ని సృష్టిస్తాయో వేచి చూడాలి. ‘జనగణ మన ఇప్పుడు మన జాతీయ గీతం, దాన్ని గౌరవించాల్సిందే. అది మరే ఇతర సెంటిమెంట్‌నైనా కల్పిస్తుందనడానికి కారణాలేమీ లేవు. అయితే అది రాజ్యాంగం నిర్ణయించిన జాతీయ గీతం. అయితే నిజమైన అర్థాన్ని బట్టి చూసినట్లయితే వందేమాతరమే నిజమైన జాతీయ గీతం’ అని భయ్యాజీ జోషీ శుక్రవారం ఇక్కడ దీనదయాళ్ ఉపాధ్యాయ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో మాట్లాడుతూ అన్నారు. ‘రాజ్యాంగం కారణంగా సృష్టించబడిన అంశాలను మేము జాతీయమైనవిగా పరిగణిస్తాం. జనగణమన రాసిందెప్పుడు? కొద్దికాలం క్రితమే దాన్ని రాశారు. అయితే జనగణమనలో వ్యక్తం చేసిన భావాలు దేశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యక్తం చేసినవి’ అని అన్నారు. అయితే వందేమాతరంలో వ్యక్తం చేసిన భావాలు, దేశ స్వరూప స్వభావాలను వ్యక్తం చేస్తాయి. ఈ రెండు గీతాల మధ్య ఉన్న తేడా అదే. అయితే ఈ రెండు గీతాలూ గౌరవించదగినవేనని జోషీ అన్నారు. బంకించంద్ర చటోపాధ్యాయ రాసిన వందేమాతర గీతం స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.