జాతీయ వార్తలు

సర్కారును నడుపుతారా? వంట చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షోలాపూర్, అక్టోబర్ 12: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన ఇచ్చిన రూ. పదికి భోజనం హామీపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ శనివారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో ‘జుంకా భకర్’ కేంద్రాలు ఉండినాయని, తరువాత వాటిని మూసివేశారని ఆయన గుర్తుచేశారు. అక్టోబర్ 21న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే పేదలకు రూ. పదికి ఫుల్ మీల్ (కడుపునిండా భోజనం) ఏర్పాటు చేయడం జరుగుతుందని శివసేన తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. షోలాపూర్ జిల్లా బార్షీలో ఒక ఎన్నికల సభలో పవార్ మాట్లాడుతూ 1990లలో తొలి శివసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రధానంగా తినే ‘జుంకా-్భకర్’ను అమ్మడానికి కేంద్రాలు ఏర్పాటు చేసి, సబ్సిడీ ధరపై అందించిందని అన్నారు. అయితే, ఈ కేంద్రాలు ఎప్పుడు మూతపడ్డాయో ఎవరికీ తెలియదని, వాటికి కేటాయించిన స్థలాలను శివసేన కార్యకర్తలు ఆక్రమించుకున్నారని ఆయన విమర్శించారు. ‘ఇప్పుడు రూ. పదికి భోజనం పథకం గురించి చెబుతున్నారు. అయితే, ప్రజలు మిమ్మల్ని రాష్ట్రాన్ని నడుపుమని అడుగుతున్నారా? వంట చేయిమని అడుగుతున్నారా?’ అని పవార్ శివసేనను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఈ ఎన్నికలలో ప్రతిపక్షం ఏమాత్రం పోటీ ఇవ్వడం లేదని చేసిన వ్యాఖ్యలను కూడా పవార్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘ముఖ్యమంత్రి తమ మల్లయోధులు సిద్ధంగా ఉన్నారని, కాని పోట్లాడటానికి ఎవరూ లేరని అన్నారు. కాని, మీరు మల్లయోధులతోనే పోరాడాలి. ‘అలాంటి’ ప్రజలతో కాదు’ అని పవార్ ఫడ్నవిస్‌ను ఉద్దేశించి అన్నారు. ‘ప్రతిపక్షం గట్టిగా లేకుంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తొమ్మిది ర్యాలీలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో 20 ర్యాలీలు ఎందుకు ఏర్పాటు చేశారు?’ అని పవార్ నిలదీశారు.