జాతీయ వార్తలు

సుప్రీం తీర్పు మాకే అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, అక్టోబర్ 12: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం కేసులో సుప్రీంకోర్టు తీర్పు ముస్లింలకు అనుకూలంగా వెలువడుతుందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ‘న్యా య పాలన, రాజ్యాంగ వౌలిక విలువలకు అనుగుణంగా ఉంటుంది’ అని పేర్కొంది. ఏఐఎంపీఎల్‌బీ ఎగ్జిక్యూటివ్ కమిటి శనివారం నాడిక్కడ సమావేశమయింది. ముమ్మారు తలాక్‌కు వ్యతిరేకంగా తెచ్చిన చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేయాలని కూడా బోర్డు శనివారం నిర్ణయించింది. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు చట్టపరంగా కాని న్యాయపరంగా కాని ఎలాంటి చర్య తీసుకోరాదని హెచ్చరించింది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతదేశ స్ఫూర్తికి ఉమ్మడి పౌరస్మృతి ఒక ముప్పు అని అభివర్ణించింది. ‘బాబ్రీ మసీదు వ్యాజ్యాన్ని మన దేశమే కాకుండా అంతర్జాతీయ సమాజం కూడా గమనిస్తోంది. మన రాజ్యాంగం కల్పించిన లౌకికవాద వౌలిక విలువలకు ఇది ఒక పరీక్ష వంటిది’ అని ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశానంతరం ఏఐఎంపీఎల్‌బీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏఐఎంపీఎల్‌బీ చీఫ్ రాబీ హసన్ నద్వీ ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశానికి అధ్యక్షత వహించారు. ‘అత్యున్నత న్యాయస్థానం అంతిమ తీర్పు న్యాయ పాలన, రాజ్యాంగ వౌలిక విలువలకు అనుగుణంగా ఉంటుందని చెప్పవలసిన అవసరం లేదు’ అని ఏఐఎంపీఎల్‌బీ ఆ ప్రకటనలో పేర్కొంది.