జాతీయ వార్తలు

మామల్లాపూర్ బీచ్‌లో మోదీ స్వచ్ఛ్భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామల్లాపురం (తమిళనాడు) : స్వచ్ఛ్భారత్‌పై తన అంకిత భావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రుజువు చేసుకున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో మామల్లాపూర్‌లో చర్చలు జరిపిన ప్రధాని, శనివారం మార్నింగ్ వాక్‌లో ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. మామల్లాపురం బీచ్‌లో కాళ్లకు చెప్పులు వేసుకోకుండా నడిచిన ప్రధాని అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించడంతో వెంటనే స్పందించారు. వాటిని ఏరుతూ ముందుకు సాగారు. అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాల కవర్‌ను అక్కడి హోటల్ ఉద్యోగి జయరాజ్‌కు అందించారు. బీచ్‌లో తన ‘స్వచ్ఛ్భారత్’పై మూడు నిమిషాల వీడియోను ఆయన ట్వీట్ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించిన కేంద్రం, పర్యావరణ పరిరక్షణకు ఇతోథిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారాన్ని పడవేయవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో చెత్తాచెదారం లేకుండా చూడాలని అంటూ, మామల్లాపురం సముద్రపు ఒడ్డును పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛ్భారత్ అభియాన్ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఆయన అన్నారు.
ఇలావుంటే, ప్రధాని మోదీ వీడియో క్లిప్పింగ్‌ను ట్యాగ్ చేస్తూ ‘నిజమైన నాయకుడు మాటల కంటే చేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. పరిశుభ్రతకు నిరంతరం కృషి చేస్తున్న మోదీకి రుణపడి ఉంటాం’ అని వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్‌తోపాటు స్వచ్ఛ సముద్రకు కూడా పునరంకితం కావాలని ఆయన ప్రజలను కోరారు. రిపుదమన్ బెల్వీ వ్యాహ్యాళికి లేదా మార్నింగ్ వాక్‌కు వెళ్లినప్పుడు, కనిపించిన ప్లాస్టిక్ లేది ఇతర వ్యర్థాలను ఏరేవారు. భారత్‌లో మొట్టమొదటి ‘ప్లోగర్’గా అతను గుర్తింపు పొందారు. బెల్వీ స్ఫూర్తితోనే మోదీ ‘ప్లోగింగ్’ (వ్యర్థాలను ఏరడం) చేశారని అంటున్నారు. వ్యర్థాలను ఏరివేయడం అనేది ప్రజలంతా ఒక అలవాటుగా చేసుకుంటే, స్వచ్ఛ్భారత్ తొందరలోనే సాధ్యమవుతుందని ఇటీవలే ప్రధాని మోదీ చేసిన ప్రకటనను గుర్తుచేస్తున్నారు.
*చిత్రం...మార్నింగ్ వాక్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు