జాతీయ వార్తలు

హర్యానా ప్రతిపక్షాల్లో ‘విశ్వసనీయత సంక్షోభం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, అక్టోబర్ 13: ప్రతిపక్ష కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీలు ‘విశ్వసనీయత సంక్షోభాన్ని’ ఎదుర్కొంటున్నాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల మేనిఫెస్టోలో చెబుతున్న ఉచిత హామీలేవీ ఓట్లను రాల్చలేవని కరాఖండీగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ కేవలం ‘వాస్తవపూరితమైన హామీలను’ మాత్రమే ఇస్తోందని స్పష్టం చేశారు. అక్టోబర్ 21 జరగనున్న హర్యానా ఎన్నికలను పురస్కరించుకొని బీజేపీ ఆదివారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఖత్తర్ మాట్లాడుతూ ‘ఓటర్లు చాలా తెలివైనవారు.. పరిణితి చెందారు.. ప్రతిపక్షాలు ఇచ్చే హామీల సాధ్యాసాధ్యాలుపై వారికి పూర్తి అవగాహన ఉంది’ అని మేనిఫెస్టో విడుదల అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో హర్యానా సీఎం స్పష్టం చేశారు. రైతులు, ఎస్సీలు సులభంగా రుణాలిచ్చే అంశాన్ని మా మేనిఫెస్టోలో చేర్చాం.. మహిళలు, యువతకు సాధ్యమయ్యే హామీలను మాత్రమే మా ప్రణాళికలో పేర్కొన్నామని చెప్పారు. అలాగే, మా ప్రణాళికలో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థినులకు ఉచిత విద్యతో పాటు 25 లక్షల మంది నిరుద్యోగ యువతకు నైపుణ్యంపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నామని సీఎం వివరించారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ఆర్‌ఎల్ కతారియా, రావు ఇందర్‌జిత్ సింగ్, హర్యానా మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ రుణ మాఫీ హామీపై దృష్టి పెట్టిందనీ.. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే రుణమాఫీ చేస్తామని చెప్పడం ఎంతమాత్రం సాధ్యం కాదనీ.. ఈ సంగతి ప్రజలకు కూడా తెలుసని అన్నారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారనీ.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కేవలం 50వేల వరకు మాత్రమే రుణమాఫీ చేయగలిగారు’ అని సీఎం ఖతర్ స్పష్టం చేశారు. ‘మేము ప్రజాక్షేత్రంలో ఎన్నికల పరీక్షకు కూర్చొన్నాం.. ప్రజలు ఏ విధంగా తమ తీర్పు ద్వారా మమ్మల్ని పాస్ చేయాలో నిర్ణయించనున్నారు’ అని సీఎం వివరించారు.
హర్యానాను వచ్చే ఐదేళ్లలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే బీజేపీ లక్ష్యమని ముఖ్యమంత్రి ఖత్తర్ స్పష్టం చేశారు.

*చిత్రం... బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు నడ్డా