జాతీయ వార్తలు

ఏపీఏ భేటీలో కాశ్మీర్‌ను ప్రస్తావిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: ఆసియన్ పార్లమెంటరి అసెంబ్లీ (ఏపీఏ) సమావేశంలో జమ్మూకాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆదివారం విరుచుకుపడ్డారు. బెల్‌గ్రేడ్‌లో జరిగిన ఏపీఏ సమావేశంలో పాకిస్తాన్ జమ్మూకాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. జమ్మూకాశ్మీర్‌లో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా 2019 డిసెంబర్‌లో పాకిస్తాన్‌లో జరుగవలసి ఉన్న ఏపీఏ ప్లీనరీని నిర్వహించలేకపోతున్నానని పాకిస్తాన్ పేర్కొంది. అయితే, భారతదేశ అంతర్గత అంశాన్ని ఏపీఏ సమావేశంలో ప్రస్తావించడం ద్వారా పాకిస్తాన్ ఏపీఏను రాజకీయం చేయడానికి ప్రయత్నించిందని శశిథరూర్ మండిపడ్డారు. ఇంటర్-పార్లమెంటరీ యూనియన్ వార్షిక సమావేశం సందర్భంగా విడిగా నిర్వహించిన ఏపీఏ సమావేశంలో థరూర్ మాట్లాడుతూ పాకిస్తాన్ జమ్మూకాశ్మీర్ అంశాన్ని ఎలా ప్రస్తావిస్తుందని నిలదీశారు. పాకిస్తాన్ సెనేట్ చైర్మన్ భారతదేశ అంతర్గత అంశాన్ని ప్రస్తావించారని, ఏపీఏను అనవసరంగా రాజకీయం చేయడానికి ప్రయత్నించారని ఆయన విమర్శించారు. ‘జమ్మూకాశ్మీర్ ఇండియన్ యూనియన్‌లో అంతర్భాగం. జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. పాకిస్తాన్‌లో జీవించే, పనిచేసేవారిపై జమ్మూకాశ్మీర్‌లో చోటు చేసుకున్న పరిణామాలు ఏమాత్రం ప్రభావితం చేయలేవు’ అని మాజీ విదేశాంగ శాఖ సహాయమంత్రి అయిన థరూర్ అన్నారు. ‘్భరత అంత్గరత అంశాలను సరిహద్దుల వద్దకు, పొరుగు దేశాల వద్దకు తీసికెళ్లొద్దు’ అని ఆయన హితవు పలికారు.