జాతీయ వార్తలు

కొత్త చరిత్ర సృష్టిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి చారిత్రక విజయాన్ని సాధిస్తుందని, 288 సీట్లు కలిగిన అసెంబ్లీలో 222 స్థానాలను గెల్చుకుంటుందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ అన్నారు. శనివారంనాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో 221 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెల్చుకుందని, ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొడుతూ తమ కూటమి 222 కైవసం చేసుకుంటుందని అన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ విజయాన్ని బద్దలు కొట్టడమే కాకుండా తామే కొత్త రికార్డును సృష్టించబోతున్నామని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పనితీరు పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, ఇదే తమ విజయానికి దారితీస్తుందని జవడేకర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు నాయకత్వలేమితో సతమతమవుతున్నాయని పేర్కొన్న ఆయన ‘రాహుల్ గాంధీ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ బీజేపీ విజయం ఖాయం’ అని అన్నారు. అమిత్ షాకు కేంద్ర హోం మంత్రిగా పదవీ బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో బీజేపీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతను జేపీ నడ్డాకు అందించామని గుర్తు చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎవరు అధ్యక్షులో, ఎవరు తాత్కాలిక అధ్యక్షులో తెలియని గందరగోళం ఎదురవుతోందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు విదేశీ పర్యటనలకు వెళ్లడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించిన ఇప్పుడు తన ఎన్నికల విజయం కోసం చిన్నా చితక పార్టీల సాయం కోరుతోందని ఆయన వ్యాఖ్యానించారు. అసలు దేశంలో ఎన్‌ఆర్‌సీని తీసుకువచ్చిందని రాజీవ్ గాంధీయేనని, ఇప్పుడు దానినే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. కాశ్మీర్‌కు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించిన జవడేకర్ 370 అధికరణ రద్దయి 75 రోజులు గడిచినా ఇంతవరకు ఒక్క హింసాత్మక సంఘటన కూడా అక్కడ జరగలేదని అన్నారు.
*చిత్రం... కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్