జాతీయ వార్తలు

హర్యానాలో హోరా హోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ / సోనిపట్ (హర్యానా), అక్టోబర్ 14: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేదనీ.. అసభ్యకరంగా మాట్లాడడం.. నిందలు మోపడం ఆయనకే చెల్లిందనీ.. ముఖ్యంగా హర్యానా మహిళలకు ఆయన బేషరతుగా తక్షణమే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సోమవారం డిమాండ్ చేశారు. అలాగే, ‘‘కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేయాలో తేలడానికి మూడు నెలలు కాలం పట్టిందనీ.. అది కూడా ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా అధ్యక్ష పదవికి మళ్లీ సోనియా గాంధీనే ఎంపిక చేశారు.. అది కూడా ‘చచ్చిన ఎలుకను పట్టారు’ అంటూ హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్ ఎన్నికల ప్రచారంలో దుయ్యబట్టారు’’. అక్టోబర్ 21న జరగనున్న ఎన్నికలను పురస్కరించుకొని ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేడెక్కించారు. సోనియా గాంధీపై నిందలు మోపడాన్ని చూస్తుంటే ముఖ్యమంత్రి ఖట్టర్‌కు మహిళలపై చులకనభావం ఏ మేరకు ఉందో చెప్పకనే చెబుతోందనీ హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి కుమారి సెల్జా పేర్కొన్నారు. తక్షణమే సీఎం ఖట్టర్ యావత్ మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హర్యానా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మిత దేవ్ మాట్లాడుతూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రకటించిన నేపథ్యంలో ‘ఇకపై హర్యానా పురుషులు కాశ్మీరీ మహిళలను పెళ్లి చేసుకోవచ్చు’ అంటూ సీఎం ఖట్టర్ ఎన్నికల ర్యాలీలో మాట్లాడడం శోచనీయమనీ.. దీనిని చూస్తుంటే ఆయనకు మహిళలంటే ఆయనకు ఉన్న వివక్ష, గౌరవభావం ఎంతగా ఉందో తెలుస్తోందని అన్నారు. ఐదేళ్లుగా ముఖ్యమంత్రి ఖట్టర్‌కు మహిళలపై ఉన్న అభిమానం ఏపాటితో వారు చవి చూశారని అక్టోబర్ 21వ తేదీతో ఆయన పరిపాలనకు చివరి రోజేనని అభివర్ణించారు. దైనందిన జీవనంలో ప్రజలకు ఏ విధంగా గుర్తించాలో కాంగ్రెస్‌కు బాగా తెలుసునని ఒక మహిళగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్ధికోసం ఎలాంటి చర్యలకైనా దిగుతారన్నది మహిళలపై ఆయన చేసిన అసభ్యకర పదజాలమే నిదర్శనమని వివరించారు. కాగా, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై హర్యానా ముఖ్యమంత్రి సైతం తీవ్రంగానే స్పందించారు. ఎన్నికల ర్యాలీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు జననాయక్ జనతాపార్టీ (జేజేపీ)లను విమర్శిస్తూ.. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ సాగించిన ‘కుటుంబ పాలన’ ఏపాటిదో ప్రజలకు తెలుసు అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేసే ‘తమాషా’లను ప్రజలు గమనిస్తున్నారన్న సంగతిని వారు గుర్తెరగాలని సీఎం ఖట్టర్ హితవు పలికారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలకే సమయం సరిపోదు అంటూ వ్యాఖ్యానించారు. ‘ఓ వైపు పప్పును, మరో వైపు మమీ’ని ప్రజలు గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి మనిషిని వెదకడానికి మూడు నెలలు పట్టిందనీ.. మళ్లీ కుటుంబ రాజకీయాలే తెరపైకి వచ్చి గత్యంతరం లేని పరిస్థితిలో తాత్కాలిక అధ్యక్షురాలుగా సోనియాను ఎంపిక చేశారన్నారు. ఈ తతంగాన్ని గమనిస్తే ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే ఉంది.. అది కూడా చచ్చిన ఎలుకను పట్టుకొన్నారు’ అంటూ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసి.. విధిలేక అధ్యక్ష పదవికి రాహుల్ బాబా రాజీనామా చేశారనీ.. గాంధీ కుటుంబం నుంచి కాకుండా వేరే వ్యక్తిని అధ్యక్ష పదవిని చూసుకోమని చెప్పారంటే వారి ‘పలాయన వాదం’ ఎలాగ ఉందో తెలియజేస్తోందని ఖట్టర్ చురకలు వేశారు. కాంగ్రెస్ హర్యానా అధ్యక్షుడైన అశోక్ తన్వార్ పార్టీ నుంచి బయటకు వచ్చి ‘అక్కడ టిక్కెట్లను అమ్ముకొంటున్నారు’ అని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోందని అన్నారు. కాంగ్రెస్ మేనిపెస్టోలో పేర్కొన్న అంశాలు అమలు కావాలంటే 1.25 లక్షల కోట్లు అవసరమని.. అది పూర్తిగా అసాధ్యమని ఖట్టర్ స్పష్టం చేశారు.