జాతీయ వార్తలు

పీవీ విధానాలే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: మాంద్యంలో చిక్కుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టాలంటే నాటి పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అనుసరించిన ఆర్థిక విధానాలనే అమలు చేయాల్సి ఉంటుందని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశే్లషకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ కేంద్రానికి సూచించారు. ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసంలో ఈ అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నెహ్రూ అనుసరించిన ఆర్థిక విధానాలను అధికార బీజేపీ తప్పుపట్టడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ రకమైన విమర్శలు చేస్తున్నారు తప్ప వాటిలో ఎలాంటి సారం లేదని అన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ బీజేపీకి రాజకీయంగా మూలస్తంభం అయినట్టుగానే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదిన వ్యక్తిగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆయన విధానాలను ఇప్పుడు అనుసరించినా కూడా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడవచ్చునని సూచించారు. ప్రభుత్వం ఎంతగా నిరాకరిస్తున్నా కూడా దేశంలో దాదాపు అన్ని రంగాలు మాంద్యం గుప్పిట చిక్కుకున్నాయని ఆయన పేర్కొన్నారు.
*చిత్రం... పరకాల ప్రభాకర్