జాతీయ వార్తలు

పాక్‌పై పెరుగుతున్న ఒత్తిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవడంలో విఫలమైన పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఆర్థిక కార్యాచరణ టాస్క్ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతోందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ (ఏటీసీ) అధిపతుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ దేశం కూడా యుద్ధానికి దిగే అవకాశం లేదని, అందుకు కారణం ఆర్థిక భారంతోపాటు ప్రాణ నష్టం కూడా తీవ్రంగా ఉండడంతోపాటు ఎవరిని విజయం వరిస్తుందో తేలని అయోమయ వాతావరణం ఉండడమే కారణమని ఆయన తెలిపారు. 1989లో ఏర్పాటైన ఎఫ్‌ఏటీఎఫ్ మనీల్యాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల అందజేత, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు వచ్చే ముప్పులను నిరోధించడంపై దృష్టి పెడుతుంది. ఉగ్రవాదులకు నిధులను అందకుండా చూడాలంటూ ఇప్పటివరకు సంస్థ పాక్‌కు చేసిన హెచ్చరికలు అమలు కాకపోవడంతో దానిపై ఒత్తిడి పెరిగింది. ఇదే విషయాన్ని ధోవల్ ఏటీఎస్ సమావేశంలో ప్రస్తావించారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికల్లా తామిచ్చిన కార్యాచరణను అమలు చేయాలని ఈ సంస్థ గత ఏడాదే పాక్‌ను ఆదేశించిందని ఆయన తెలిపారు. కేవలం 40 శాతం సిఫార్సులను పాక్ అమలు చేయగలిగిందని, దీని దృష్ట్యా ఆ దేశంపై ఎఫ్‌ఏటీఎఫ్ ఆంక్షలు తప్పవని ధోవల్ అన్నారు.
మీడియా పాత్ర కీలకం
ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో అణచివేయాలంటే మీడియా పాత్ర చాలా కీలకమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అన్నారు. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏజన్సీలు వ్యవహరించాలని, మీడియా పాత్రను కూడా పరిగణనలోకి తీసుకుని ఉగ్రవాద నిరోధక చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద చర్యలకు సంబంధించి మీడియాలో ఎలాంటి కథనాలు రాకపోతే వాటంతట అవే సమసిపోతాయని చెప్పారు. అంటే, ప్రచారం వల్లే నిలదొక్కుకుంటోందని, మీడియాలో ఉగ్రవాద ఘటనలకు సంబంధించిన వార్తలు రాకపోతే దానంతట అదే అంతమైపోతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏజన్సీలు మీడియాను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, వాటి ప్రమేయంతోనే పారదర్శకమైన విధానాలను చేపట్టాలని ఆయన కోరారు. గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ చేసిన వ్యాఖ్యలను ధోవల్ ఈ సందర్భంగా ఉటంకించారు. ‘ఉగ్రవాద చర్యలకు మీడియాలో ప్రచారం లేకపోతే అది నశించిపోతుంది. ఉగ్రవాదులు ఎంతగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా దానికి సంబంధించిన వార్తలు మీడియాలో రాకపోతే ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. ఆ విధంగా ప్రచారం లేక ఉగ్రవాదం క్రమంగా అంతమైపోతుంది’ అని ఆయన పేర్కొన్నారు. దీని దృష్ట్యా పారదర్శకమైన మీడియా విధానాన్ని అవలంబించాలని, ఉగ్రవాద నిరోధక చర్యల్లో మీడియా ప్రాధాన్యతను విస్మరించకూడదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మీడియాతో ఎలా వ్యవహరించాలన్న దానిపై పూర్తి శిక్షణ అవసరమని ఆయన అన్నారు. ఇలాంటి గుణాత్మక చర్యలు చేపడితే మీడియా నుంచి కూడా పూర్తిస్థాయి మద్దతు అందుతుందని, ఈ ప్రాతిపదికనే మీడియా విధానాన్ని రూపొందించాలని ఆయన కోరారు.