జాతీయ వార్తలు

భారత్‌కు నాలుగు యునెస్కో అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దశాబ్దాలుగా భారత సాంస్కృతిక వారసత్వానికి నిలువుటద్దాలుగా నిలుస్తోన్న దేశంలోని నాలుగు ప్రతిష్టాత్మక స్థలాలకు యునెస్కో అవార్డు లభించింది. వీటిలో ముంబయిలోని 150 సంవత్సరాల నాటి ఫ్లోరా ఫౌంటేన్, కెనెసెత్ ఎలియాహూ షినగోగ్, లేడీ ఆఫ్ గ్లోరీ చర్చి, అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో ఉన్న విక్రం సారాబాయి లైబ్రరీ ఉన్నాయి. యూనెస్కో అసియా ఫసిఫిక్ అవార్డులను సోమవారం మలేషియాలోని పెనాంగ్‌లో ప్రకటించారు. ముంబయిలోని ఫ్లోరా ఫౌంటేన్‌ను దీర్ఘకాల పునరుద్ధరణ అనంతరం ఇటీవలే ప్రజల సందర్శనకు అనుమతించారు. ముంబయిలోని ఈ మూడు చారిత్రక కేంద్రాలు, దాని సాంస్కృతిక వైవిధ్యాన్ని అద్దం పడుతున్నాయని బ్యాంకాక్‌కు కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థ పేర్కొంది. భారత్‌లోని 20వ శతాబ్దం నాటి చారిత్రక వారసత్వ కేంద్రాల పునరుద్ధరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఈ సంస్థ ప్రశంసించింది. ఈ అవార్డుల్లో అత్యున్నత పురస్కారాన్ని హాంకాంగ్‌లోని చారిత్రక థాయ్‌క్వూన్ వారసత్య కేంద్రం పొందింది. ఆస్ట్రేలియా, భూటాన్, చైనా, భారత్, న్యూజిల్యాండ్ దేశాల్లోని వారసత్వ కట్టడాలను ఈ ఏడాది అవార్డుల కోసం యూనెస్కో జ్యూరీ పరిశీలించింది. ఆసియా-్ఫసిఫిక్ ప్రాంతంలోని 14 దేశాల నుంచి మొత్తం 57 ప్రతిపాదనలు యునెస్కోకు అందాయి. ముంబయిలోని ఫ్లోరా ఫౌంటేన్‌ను పునరుద్ధరించడంలో కీలక పాత్ర వహించిన నిర్మాణ నిపుణుడు వికాస్ బిలావారీ ఈ అవార్డు పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొత్తం 16 అవార్డుల్లో మొత్తం నాలుగు పురస్కారాలు భారత్‌కు అందడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ అవార్డుల పుణ్యమా అని ఇటు ప్రభుత్వం అటు ప్రజలు దేశంలోని వారసత్వ కట్టడాల పరిరక్షణకు మరింత స్పూర్తిదాయకంగా పని చేసే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు.
*చిత్రం... ముంబయిలోని ఫ్లోరా ఫౌంటెన్