జాతీయ వార్తలు

దేశమంతా బలపరిచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బల్లాబ్‌గఢ్ (హర్యానా): కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ తాను తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ బలపరుస్తున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 370 అధికరణ పట్ల కాంగ్రెస్ పార్టీకున్న మక్కువ కారణంగానే అనేక మంది సైనికులు మరణించారని హర్యానాలో సోమవారం జరిగిన ఓ ర్యాలీలో మోదీ అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని పేర్కొన్న ఆయన అధికారంలోకి వస్తే ఈ అధికరణను మళ్లీ పునరుద్ధరిస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీని సవాల్ చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి తప్పుబట్టిన మోదీ ‘ఈ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీ తీవ్రంగానే ప్రయత్నిస్తుంది. కానీ తొలి యుద్ధ విమానాల విడత భారత్‌కు అందింది’ అని అన్నారు. దేశ భద్రతను మరింతగా బలోపేతం చేసేందుకు బీజేపీ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రస్తుతం పలు రాష్ట్రాల అసెంబ్లీలో జరుగుతున్న ఎన్నికల్లోనూ జాతీయ వాదాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా సంధిస్తోంది. గతంలో ఊహకైనా అందని కఠినమైన నిర్ణయాలు తమ ప్రభు త్వం తీసుకుంటోందని, అలాంటి వాటిలో 370 అధికరణ రద్దు ఒకటని మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తనకు ఇచ్చిన చారిత్రక మద్దతు బలంతోనే తాను అనేక పెద్ద నిర్ణయాలను తీసుకోగలుగుతున్నానని మోదీ తెలిపారు. 370 అధికరణ రద్దుతో మన ప్రయోజనాలకు భంగం కలిగిందని భావిస్తున్న వ్యక్తులు ఇతర దేశాల సహాయాన్ని కోరుతున్నారని మోదీ తెలిపారు. హర్యానాలో ప్రతిపక్ష పార్టీలు కుప్పకూలుతున్నాయని మళ్లీ జతకట్టాలన్న వాటి ప్రయత్నాలు సఫలం కావడం లేదన్నారు. అయితే బీజేపీ మాత్రం బలమైన నాయకత్వంతో శక్తివంతమైన బృందంతో పనిచేస్తుందని తెలిపారు. మోదీ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తామని దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పాలని మోదీ సవాల్ చేశారు. లోక్‌సభ ఎన్నికలు వచ్చినప్పుడైనా 370 అధికరణ పునరుద్దరణ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని మోదీ సవాల్ చేశారు. ట్రిపుల్ తలాక్ విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. సమాజంలో తాము తీసుకొచ్చిన మార్పులన్నింటినీ వ్యతిరేకించేందుకు కాంగ్రెస్, ఇతర పార్టీలు తీవ్రంగానే ప్రయత్నించాయని మోదీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాఫెల్ అంశంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేసిందని కానీ, దేశ ప్రజలు దానిని పట్టించుకోకుండా తిరుగులేని మద్దతు కట్టబెట్టిందని మోదీ గుర్తుచేశారు. ఆ పార్టీ అంతగా ప్రయత్నించినా ఈ ఒప్పందం ఆగలేదని, అది తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. దేశంలో బలమైన ఆధునిక ఆయుధాలు లేకపోవడం వల్ల సైనికులు మరణించడాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని, అందుకే వారికి ఆధునిక యుద్ధ సామగ్రిని అందిస్తున్నామని మోదీ తెలిపారు. ముఖ్యమంత్రి ఖట్టర్ సారథ్యంలో హర్యానా ఎంతో అభివృద్ధి సాధించిందని మోదీ అన్నారు.
*చిత్రం... ఫరీదాబాద్‌లో సోమవారం జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ