జాతీయ వార్తలు

అస్సాం నదిలో మునిగిన పడవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, అక్టోబర్ 17: అస్సాంలో గురువారం ఒక నదిలో వెళ్తున్న పడవ మునిగిపోవడం వల్ల అందులో ప్రయాణిస్తున్న సుమారు 80 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. అనేక మోటర్ సైకిళ్లు కూడా గల్లంతయ్యాయి. గల్లంతయిన ప్రయాణికులను రక్షించడానికి ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది, జిల్లా పాలనాయంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకున్నారు. సొనిట్‌పూర్ జిల్లాలోని జియా భరలి నదిలో ఈ నాటు పడవ మునిగిపోయింది. లాల్ టాపు సమీపంలోని బిహియా గోన్ నుంచి తేజ్‌పూర్‌లోని పాంచ్ మైల్ ప్రాంతానికి వెళ్తుండగా ఈ నాటు పడవ బోల్తాపడి మునిగిపోయింది. పడవ మునిగిపోయిన సమయంలో అందులో 70 మంది నుంచి 80 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. చాలా మోటర్ బైక్‌లు ఉన్నాయి. తేజ్‌పూర్‌లో ప్రతి గురువారం వారపు సంత జరుగుతుంటుంది. ఈ సంతకు వెళ్లేందుకు ప్రజలు పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పడవ బోల్తాపడిన తరువాత కొంత మంది ప్రయాణికులు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరగలిగారు.