జాతీయ వార్తలు

సెంట్రల్ వర్శిటీ అడ్మిషన్లకు ఉమ్మడి ప్రవేశపరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్శిటీల్లో యూజీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహణ బాధ్యతను సైతం వచ్చే ఏడాది నుండి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీకి అప్పగించనున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ జేఈఈ, నీట్, జేఈఈ అడ్వాన్స్ పరీక్షలతో యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్ నెట్ సహా అనేక జాతీయ ప్రవేశపరీక్షలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
దేశవ్యాప్తంగా 49 సెంట్రల్ యూనివర్శిటీలు ఉన్నాయి. కాగా, 40 సెంట్రల్ యూనివర్శిటీలు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్నాయి, మిగిలిన 9 యూనివర్శిటీలు వేర్వేరు మంత్రిత్వశాఖల ఆధీనంలో ఉన్నాయి. ఈ 40 యూనివర్శిటీల్లో 15 యూనివర్శిటీలు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్షలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. మిగిలిన వర్శిటీలను సైతం ఎన్‌టీఏలో చేరాల్సిందిగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ సూచించింది. యూజీలో 50కి పైగా ప్రోగ్రామ్‌లతో పాటు పీజీలో 170, ఎంఫిల్- పీహెచ్‌డీ కోర్సులు మరో 100 ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించనుంది. మిగిలిన వర్శిటీలు చేరేదీ లేనిదీ ఒక వారం రోజుల్లోతేలిపోతుందని అధికారులు చెప్పారు. ఇంత వరకూ సెంట్రల్ యూనివర్శిటీలు కొన్ని స్వతంత్రంగా ప్రవేశపరీక్షలు నిర్వహిస్తుండగా, మిగిలిన వర్శిటీలకు రాజస్థాన్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రవేశపరీక్ష నిర్వహిస్తోంది.