జాతీయ వార్తలు

నేడో, రేపో అమితాబ్‌ను డిశ్చార్జీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 18: ఆసుపత్రిలో చేరిన బిగ్-బీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను నేడో, రేపో డిశ్చార్జీ చేస్తామని వైద్యులు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేవలం సాధారణ వైద్య పరీక్షల కోసమే చేరారని ఆయన సన్నిహితులు చెప్పారు. 77 ఏళ్ళ అమితాబ్ కాలేయం (లివర్) సంబంధిత వ్యాధితో ఈ నెల 11న ఆసుపత్రిలో చేరారని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని తెలిపారు. ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో మంళవారం చేరారని శుక్రవారం వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, లివర్ ఇన్‌ఫెక్షన్ ఏమీ లేదని, కేవలం రొటీన్‌గా చేసుకునే సాధారణ పరీక్షల కోసమే చేరారని వారు చెప్పారు. అమితాబ్‌ను ఒకటి, రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ చేస్తామన్నారు. అమితామ్‌కు నిర్వహిస్తున్న పరీక్షల వివరాలు వెల్లడించేందుకు వైద్యులు నిరాకరించారు. అమితాబ్ ప్రస్తుతం సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 1982 సంవత్సరంలో ‘కూలీ’ చిత్ర నిర్మాణం షూటింగ్ సమయంలో అమితాబ్ స్వల్పంగా గాయపడ్డారు. అయితే వెన్నుపూసగా నొప్పిగా ఉండడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు.