జాతీయ వార్తలు

మేము పిల్లలతో కుస్తీ చేయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీడ్ (మహారాష్ట్ర), అక్టోబర్ 18: ‘మేము పిల్లలతో కుస్తీ చేయం..’ అని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్ధేశించి చురక అంటించారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయని, తమతో కుస్తీ పడగల సాహసం ప్రతిపక్షాలకు లేదని బీజేపీ నాయకుడు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై ఎన్‌సీపీ మూల పురుషుడైన 78 ఏళ్ళ పవార్ ఘాటుగా స్పందించారు. బీడ్ జిల్లాలోని అంబెజోగాయిలో శుక్రవారం జరిగిన ఎన్‌సీపీ ఎన్నికల ర్యాలీనుద్ధేశించి పవార్ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ఎద్దెవా చేశారు. తాము పిల్లలతో కుస్తీ చేయమని అనడంతోనే కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ఎన్నికల యుద్ధంలో తమకు సమఉజ్జీ లేరని, కుస్తీ పడేందుకు బలహీనమైన ప్రతిపక్షం ఉంద ని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వ్యాఖ్యానించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడే ఎందుకు దృష్టి కేంద్రీకరించి, ఎన్నికల ర్యాలీల్లో, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారని ప్రశ్నించారు. బీజేపీ, శివసేన నాయకులు చేస్తున్న ప్రసంగాల్లో తననే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రథాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రసంగాల్లో రాజ్యాంగంలోని 370-అధికరణ రద్దు గురించి చెబుతున్నారని ఆయన చెప్పారు. 370-అధికరణ రద్దును తాము వ్యతిరేకించడం లేదని, అయితే వారి ప్రసంగాల్లో ప్రజా సమస్యల పరిష్కారం గురించి చెబితే బాగుంటుందని పవార్ అన్నారు.