జాతీయ వార్తలు

ఐదేళ్లలో నక్సలిజం అంతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గడ్చిరోలి, అక్టోబర్ 18: దాదాపు ఏడు దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన గాంధీ కుటుంబం ఆదివాసీలకు చేసిన మేలేమిటని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి శుక్రవారంనాడు ఇక్కడ జరిగిన ఒక ర్యాలీలో మాట్లాడిన అమిత్ షా ‘నాలుగు తరాల గాంధీ కుటుంబమే దేశాన్ని పాలించినా ఆదివాసీలకు కలిగిన ప్రయోజనం ఏమీ లేదు’ అని అన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని గడ్చిరోలి జిల్లాలోని అహేరిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రకటించారు. గతంలో వచ్చిన ప్రభుత్వాల కంటే కూడా మోదీ సర్కారు వచ్చిన తర్వాత ఆదివాసీలకు ఎంతో ప్రయోజనం కలిగిందని, ఇందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతగానో కృషి చేసిందని ఆయన తెలిపారు. కాశ్మీర్‌లో 370 అధికరణ కొనసాగడం వల్లే ఉగ్రవాదం పెరిగిపోయిందని, ఏడు దశాబ్దాల కాలంలో 40 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. దశాబ్దాల తరబడి ఓటుబ్యాంకు రాజకీయాలకు ఆయా పార్టీలు పాల్పడడం వల్లే ఈ పరిణామం చోటుచేసుకుందని పేర్కొన్న ఆయన కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిందని, 370 అధికరణ రద్దయిందని తెలిపారు. గతంలో వచ్చిన ప్రభుత్వాలు ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించలేదని, కానీ ఆ పని మోదీ ప్రభుత్వం చేసిందని అమిత్ షా గుర్తు చేశారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్పించని ప్రయోజనాలను కేవలం ఐదేళ్లకాలంలోనే ఆదివాసీలకు మోదీ సర్కారు అందించిందని ఆయన తెలిపారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వెల్లడించిన అమిత్ షా ‘గడ్చిరోలిలోనే 1.30 లక్షల టాయిలెట్లు నిర్మించాం. 48 వేల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం. 48 వేల ఆదివాసీ కుటుంబాలకు విద్యుత్ సౌకర్యాలు కల్పించాం. అలాగే 8వేల మంది పేద గిరిజనులకు ఇళ్లు అందించాం’ అని తెలిపారు. మరి తాము అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై శరద్ పవార్, రాహుల్‌గాంధీతో చర్చలకు తాము సిద్ధమని అమిత్ షా తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో నక్సలిజాన్ని మోదీ ప్రభుత్వం అణచివేసిందని, ఈ ప్రాంతాన్ని పూర్తిగా మావోయిస్టు పీడన నుంచి విముక్తం చేస్తామని, ఇతర ప్రాంతాల ప్రజలతో సమానంగా పోటీ పడేలా ఈ ప్రాంత యువతకు అవకాశాలు కల్పిస్తామని అమిత్ షా తెలిపారు.