జాతీయ వార్తలు

జనం మనోగతం పట్టని కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొహానా/హిస్సార్, అక్టోబర్ 18: ‘పొరుగు దేశమైన పాకిస్తాన్‌తో మీకున్న అనుబంధం ఏమిటి?’ అంటూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాశ్మీర్‌కు సంబంధించిన 370 అధికరణ రద్దుపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను భారత వ్యతిరేక ప్రచారానికి పాకిస్తాన్ వినియోగించుకుంటోందని మోదీ అన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 370 అధికరణ రద్దును ప్రధాన రాజకీయ అస్త్రంగా ప్రయోగిస్తున్న మోదీ శుక్రవారం హర్యానాలో జరిగిన ర్యాలీలో కూడా ఈ అంశంపైనే మాట్లాడారు. కాంగ్రెస్ వంటి పార్టీలకు ప్రజల మనోభావాలు తెలియవని, జవాన్లు చేసిన త్యాగాలపైనా గౌరవం లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి అనేక ప్రశ్నలను సంధించిన మోదీ ‘నేను దేశ ప్రయోజనాల కోసం పని చేయాలా? వద్దా? రాజకీయాలకు అతీతంగానే దేశ ప్రయోజనాలు ఉండాలా? ఉండకూడదా?’ అని ప్రజలను అడిగారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల మనోభావాలతో పనిలేకుండా వ్యవహరిస్తోందని, ముఖ్యంగా హర్యానా ప్రజల సెంటిమెంట్లను పట్టించుకోవడం లేదని మోదీ అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 5న రాజ్యాంగంలోని 370 అధికరణను తమ ప్రభుత్వం రద్దు చేసినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీని ఎక్కడ లేని బాధ ఆవహించిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆగస్టు 5న తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదని, అంతకు ముందు వచ్చిన ఏ ప్రభుత్వం కూడా సాహసించలేనిదని మోదీ తెలిపారు. మొత్తం భారత రాజ్యాంగమే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన రోజుగా ఆగస్టు 5 అని ఆయన అభివర్ణించారు. 70 సంవత్సరాలుగా ఉన్న ఒక ప్రధాన అవరోధాన్ని 370 అధికరణ రద్దు ద్వారా తమ ప్రభుత్వం తొలగించిందని, ఆవిధంగా భారత్‌లో కాశ్మీర్ విలీనాన్ని పరిపూర్ణం చేసిందని ఆయన అన్నారు. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్, ఇతర పార్టీలు అనుభవిస్తున్న వేదనకు మందే లేదని మోదీ వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్, లక్షిత దాడుల గురించి తామెప్పుడు మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని బాధ పుట్టుకొస్తోందని, ముఖ్యంగా బాలాకోట్ దాడుల గురించి ప్రస్తావిస్తే ఆ బాధ మరింత పెరిగిపోతోందని మోదీ అన్నారు. 370 అధికరణ రద్దుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతికూల ప్రకటనలను పొరుగున ఉన్న పాకిస్తాన్ తన సంకుచిత ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌కు ప్రయోజనం కలిగించే ప్రకటనలను కాంగ్రెస్ ఎందుకు చేస్తోందో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తనను విమర్శించడానికి కాంగ్రెస్ నాయకత్వం తప్పుడు ప్రకటనలు, వాదనలను చేస్తోందని, వీటిన్నిటినీ ఉపయోగించుకుంటున్న పాకిస్తాన్ కాశ్మీర్‌పై తన వాదనలకు బలాన్ని పెంచుకుంటోందని మోదీ అన్నారు. తనకు దేశ ప్రజల ఆశీస్సులు ఉన్నంతవరకు ఎవరు ఎంతగా తిట్టినా, ఎంతగా విమర్శించినా ఎలాంటి ప్రయోజనం ఉండదని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశ సమైక్యత గానీ, అంబేద్కర్ అందించిన రాజ్యాంగంగానీ ఎంతమాత్రం పట్టదని విమర్శించిన మోదీ ఇలాంటి పార్టీ పట్ల హర్యానా ప్రజలు ఎలాంటి కనికరాన్ని చూపకూడదని అన్నారు.