జాతీయ వార్తలు

ప్రత్యేక జెండా, రాజ్యాంగం కుదరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: నాగాలకు ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండాను అనుమతించే ప్రసక్తే లేదని రాష్ట్ర గవర్నర్, చర్చల మధ్యవర్తి ఆర్.ఎన్.రవి తేల్చిచెప్పారు. నాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌ఎస్‌సీఎన్-ఐఎం డిమాండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని తేల్చిచెప్పిన ఆయన తుపాకీ నీడలో నిరవధికంగా ఈ మిలిటెంట్ సంస్థతో చర్చలు జరిపేది లేదని విస్పష్టంగా తెలిపారు. ఎలాంటి జాప్యం లేకుండా దశాబ్దాల శాంతి ప్రక్రియను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై తుది ఒప్పందానికి మార్గం సుగమం అవుతుందని ఆయన వెల్లడించారు. సమస్య ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో ఎన్‌ఎస్‌సీఎన్ వేర్పాటువాదులు కొత్త డిమాండ్లను తెరపైకి తేవడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన అన్నారు. సమస్య పరిష్కారాన్ని మరింత జాప్యం చేయాలన్న ఉద్దేశ్యంతోనే నాగా వేర్పాటువాదులు ఈ జాప్యంజారీ ధోరణిని అవలంబిస్తున్నారని గవర్నర్ అన్నారు. నాగాలకు ప్రత్యేక జాతీ య జెండా, రాజ్యాంగం కావాలన్న డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించే ప్రసక్తే ఉండదని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన 370 అధికరణను రద్దు చేసిన కేంద్రం ఆ రాష్ట్రా న్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో నాగాలాండ్ గవర్నర్ చేసిన ఈ ప్రకటనకు మరింత రాజకీయ ప్రాధాన్యత చేకూరింది. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యం, ఒకే జెండా ఉండాలన్నది తమ అభిమతమని, ఇందు కు సంబంధించి ఏవిధంగానూ రాజీ పడేది లేదని ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో నాగాల డిమాండ్‌ను తిరస్కరిస్తూ రాష్ట్ర గవర్నర్ ఈ నిర్ద్వంద్వ ప్రకటన చేయడం గమనార్హం. సమస్య ఒక కొలిక్కి వస్తు న్న తరుణంలో ఎన్‌ఎస్‌సీఎన్ వేర్పాటువాదులు ఉద్దేశ్యపూర్వంగానే ఆచరణయోగ్యంకాని డిమాండ్లను ఒప్పంద పరిధిలోకి తెస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 3న ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఎన్‌ఎస్‌సీఎన్ ప్రధాన కార్య దర్శి మూయివాకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పంద పరిధిలోనే నాగాలాండ్ సమస్యను పరిష్కంచడం జరుగుతుందని గవర్నర్ తేల్చిచెప్పారు.