జాతీయ వార్తలు

పాక్‌ను ముక్కలు చేసింది కాంగ్రెస్సే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370-అధికరణ రద్దుకు సంబంధించి బీజేపీ నాయకత్వం చేసుకుంటున్న ప్రచారాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీని నిలదీయడాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ సవాల్ చేశారు. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందడానికే బీజేపీ నేతలు వాస్తవాన్ని వక్రీకరిస్తున్నారని, నిజానికి పాక్‌లో అంతర్భాగంగా ఉన్న ఓ భాగాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీయేనని బంగ్లాదేశ్ ఏర్పాటును సిబల్ పరోక్షంగా ప్రస్తావించారు. 370-అధికరణ భారత దేశ అంతరంగికమని కానీ పాక్‌ను రెండు ముక్కలు చేసిన కాంగ్రెస్‌దేనని అన్నారు. ఈ నిజాన్ని ప్రధాని మోదీ ప్రజలకు తెలియజేయాలని సిబల్ డిమాండ్ చేశారు. ‘ప్రధాని మోదీకి 370-అధికరణ గురించే తెలుసు. పాకిస్తాన్ ఎప్పుడు చీలిపోయింది? ఆ పని ఎవరు చేసింది? పాకిస్తాన్ అంతర్గత భాగాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీయే. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు’ అని మోదీని సిబల్ ప్రశ్నించారు. ఈ ఘనత సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అందుకు కాంగ్రెస్ పార్టీని కీర్తించాల్సిన అవసరం మోదీకి ఉందని పేర్కొన్న సిబల్ ‘ఆ ధైర్యం మోదీకి లేదు’ అని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా పౌష్టికాహార స్థాయిని పెంచడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రజారోగ్యాన్ని ఇనుమడింపజేయడం వంటి బాధ్యతలు ప్రభుత్వానివేనని రాజ్యాంగంలోని 47వ అధికరణ స్పష్టం చేస్తున్నదని గుర్తు చేసిన సిబల్ ‘దీనిని అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం సాధించింది ఏమిటీ?’ అని ప్రశ్నించారు. మోదీకి తన రాజ్యాంగ బాధ్యతల గురించి తెలియవని, దేశ వ్యాప్తంగా 93 శాతం మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో అవస్థలు పడుతున్నా వాటిని పట్టించుకోని ఆయన 370-అధికరణపైనే ప్రచారం సాగిస్తున్నారని సిబల్ దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మోదీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారని, ప్రజల సమస్యలు మోదీకి పట్టవని సిబల్ అన్నారు. 370-అధికరణ కారణంగానే కాశ్మీర్ అభివృద్ధి కుంటుపడిందన్న విమర్శలు సైతం సిబల్ తిప్పికొట్టారు. హర్యానా, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్నత విద్య, పేదరికం, శిశు మరణాలు, నిరుద్యోగ సమస్యలను ప్రస్తావించిన సిబల్ ‘ఈ రాష్ట్రాల్లో 370-అధికరణ అమలులో లేదు. అయినా కూడా వీటన్నింటి కంటే కాశ్మీర్ ఎంతో ముందంజలో ఉంది’ అని అన్నారు. 370-అధికరణ కాశ్మీర్ అభివృద్ధికి ప్రతిబంధకం అని చెబుతున్నప్పుడు ఈ రాష్ట్రాలన్నింటి కంటే కీలక అంశాల విషయంలో కాశ్మీర్ పురోగతి సాధించడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. కాశ్మీర్‌లో పేదరిక స్థాయి 10.35 శాతం ఉంటే, మహారాష్టల్రో 17.35 శాతం, హర్యానాలో 11.16 శాతం, ఉత్తర్ ప్రదేశ్‌లో 29.43 శాతం, గుజరాత్‌లో 16.63 శాతం, మధ్య ప్రదేశ్‌లో 31.65 శాతం ఉందని ఆయన గుర్తు చేశారు. అలాగే కాశ్మీర్‌లో నిరుద్యోగ సమస్య 5.3 శాతంగా ఉంటే, హర్యానాలో 28.78 శాతం ఉందని తెలిపారు. హర్యానా, మహారాష్టల్రో 2013-16 మధ్య వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని సిబల్ తెలిపారు. 34 వేల కోట్ల రూపాయల మేర రైతుల రుణాలను మాఫీ చేశామని ప్రధాని మోదీ చెప్పుకుంటున్నారని పేర్కొన్న ఆయన ఇప్పటి వరకు కేవలం 16 వేల కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేశారని 50 లక్షల మంది రైతులకు ఈ రుణాలే అందుబాటులో లేవన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు డేటాను ఉటంకిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిందని అన్నారు. అయినప్పటికీ కూడా ఈ వాస్తవాన్ని అంగీకరించలేక బీజేపీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తున్నదని ఆయన తెలిపారు.

*చిత్రం... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్