జాతీయ వార్తలు

పోలీసుల సేవలు నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశవ్యాప్తంగా పోలీసులకు సానుకూలమైన పని వాతావరణం కల్పిస్తామని, వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. పోలీస్ అమరయోధులకు నివాళులు అర్పించిన అనంతరం సోమవారం ఇక్కడ జరిగిన పోలీసులు, పారా మిలటరీ దళాల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఖాకీ దుస్తుల్లో ఉన్న స్ర్తిలు, పురుషులు దేశానికి అంకితభావంతో చేస్తున్న సేవల వల్లే భారత్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన దేశంగా మారిందని అమిత్ షా తెలిపారు. లక్ష మంది ప్రజలకు 222 మంది పోలీసులు ఉండడం ప్రామాణికం అయితే భారత్‌లో 144 మందే ఉన్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. దీని కారణంగానే దాదాపు 90 శాతానికి పైగా పోలీసులు రోజుకు 12 గంటలు పని చేయాల్సి వస్తోందని, వీరిలో నాలుగింట మూడో వంతు మందికి వారాంతపు సెలవులే లేవని ఆయన అన్నారు. అయితే, తమ ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తోందని, ఆ దిశగా మరింత ముందుకు వెళ్తామని తెలిపారు. నిర్ణీత కాలవ్యవధిలో పోలీసులకు సానుకూల పని పరిస్థితులు కల్పిస్తామని, ఆరోగ్యం, గృహ కల్పన, కుటుంబ సంక్షేమానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. సోమవారం పోలీస్ సంస్మరణ దినం కావడంతో వారి సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హోం మంత్రి వివరించారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి యావత్ భారతం శ్రద్ధాంజలి ఘటించాలని, వారి సేవలను అనునిత్యం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం మొదలుకుని తిరుగుబాటుదారుల అణచివేత వరకు, అలాగే నక్సలైట్లను ఢీకొనడం నుంచి రోడ్లపై ట్రాఫిక్‌ను నియంత్రించడం వరకు అత్యంత కీలకమైన విధులను పోలీసులు నిర్వరిస్తున్నారని అన్నారు. భారత్ అంతర్గతంగా శక్తివంతం కావడానికి, అంతర్జాతీయంగా బలమైన దేశంగా ఎదగడంలో పోలీసుల పాత్ర, వారి సేవలు అత్యంత కీలకమని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 35వేల మంది పోలీసులు విధి నిర్వహణలో మరణించినట్టుగా తాజా లెక్కలు చెబుతున్నాయి. అయితే, గత ఏడాది కాలంలో విధి నిర్వహణలోనే 292 మంది పోలీసులు మరణించారు.
*చిత్రం... న్యూఢిల్లీలో సోమవారం జరిగిన పోలీస్ సంస్మరణ దినోత్సవంలో మాట్లాడుతున్న హోం మంత్రి అమిత్ షా